కజిరంగా- కజిరంగా-

ఒక నిశ్చల నిమీలిత నేత్రం-

మంచు తెరల అంచులు కోస్తూ

నిశ్శబ్ద కుంజర గమనం-

ఏనుగంత గడ్దిలో ఏనుగెక్కి సవారీ-

ఈ ఆకాశానికెన్ని జింకల అడుగు జాడలు!

ఎన్నెన్ని తెల్లకొంగల మబ్బు మరకలు!!

ఖడ్గమృగాలు నిర్భయంగా కొమ్ము తలెత్తే సువిశాల మైదానం

గగనానికెక్కుపెట్టిన గడ్డి బాణాలు

ఏనుగు పాదం మునిగే నునుపైన బురద నేలలు

దారంతా కాళ్ళు పొట్ట మీద మోపి

కళ్ళు చుట్టూ రిక్కించి పంచేంద్రియాల ఉత్సుకత-

ఒక మెత్తటి బోర్లించిన ఊయల ప్రయాణం

చుట్టూ వలయాకారపు గుంపుల గుంపుల జంతు ప్రాకారం

ఆ నిమిషం

గున్న ఏనుగుకి పలు తాపే అమ్మ ఏనుగు

చిన్న కూనని లాలన చేసే తల్లి ఖడ్గ మృగం

అమ్మతో చెంగు చెంగున దూకే పసి జింక పిల్ల

ప్రశ్నల వాన కురిపిస్తున్న నా ఒళ్ళోని పాపాయి

అడవంతా అమ్మ చుట్టూ తిరుగాడే పసికూనలే

చుట్టూ నక్షత్రాల వాన కురుస్తున్నట్లు

తళతళ్ళాడే మంచు సూర్యోదయపు గడ్డి కొసలు

మెరిసి మాయమయ్యే ఏవో అడవి జంతువుల పరుగులు

నా చుట్టూ నన్ను గమనిస్తూ నాక్కనిపించని వేల కళ్ళు

అలికిడిని గుర్తిస్తూ మంద్రంగా కదిలే చెవులు

అప్పటికే తుర్రుమన్న పాదాల గుర్తులు

కజిరంగా… కజిరంగా….

అల్లుకున్న తీగల – గుబురు వెదుర్ల- ఇలకోళ్ళ రొదలు

చెక్క వంతెనల వెంబడి చెట్ల బెరళ్ల గీరే పులి జాడలు

ఎక్కడికక్కడ ఒంటరిగా ప్రత్యక్షమయ్యే వందల ఖడ్గమృగాలు

మిత్ర బృందాల చిర్నవ్వు కళ్లలొ- మెరిసే తెల్లవారు ఝాము ఆహ్లాదానందం

ఏ ప్రపంచమూ ఇవ్వలేని ప్రశాంత గమనం

కళ్లన్నీ కజిరంగా ఖడ్గాలై-

చెవులన్నీ నిశ్శబ్ద ప్రతిధ్వనులై-
…………..

kajiranga kajiranga- Andhra jyothi sunday- 29-june-2008

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/29-6/Kavita

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

3 Responses to కజిరంగా- కజిరంగా-

 1. nallam syamala అంటున్నారు:

  Hai, Geetha, I am Syamala your childhood friend in Jaggampeta. Do you remember me ?
  At present I am staying at Visakhapatnam for last 6 years. One year back My husband worked as Branch Manager, SBI at Jaggampeta at that time I visited Jaggampeta and met all my old friends including your mother.
  How r u ? Just now I read your posts in your website as our brother chakravarthi has given your webaddress today morning only. My brother now working at Bhimavaram as Income Tax Officer.

  Your website is very informative and Its very nice….I read only few lines….but I will read all leisurely. I am very happy to see your photos in your website.
  My email address is bhimala.madhavisyamala@gmail.com
  – ok….bye…..bye….

 2. kalageeta అంటున్నారు:

  Thanks raa Sushmi-

 3. sushmita అంటున్నారు:

  akka awesome blog.poorthiga chadhavaledhu kani chadivinantha varaku chaala bhagundhi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s