నువ్వున్న చోట

నువ్వు చూసే శీతహరిత వృక్షాలు

నిన్ను తాకే నునులేత పవనాలు

నిన్ను తాకే తళత్తళని కిరణాలు

ఇప్పుడు నాచుట్టూ వున్నాయి

ఆకుల్లేని ఊదాపూల చెట్టు సంభ్రమంగా స్వాగతించింది

వృక్షాలన్నీ గలగలా గాలి రాల్చి సాదరంగా ఆహ్వానించాయి

పేర్లు తెలీని గడ్డిమొక్కలన్నీ గబగబా పూలుదాల్చి పలకరించాయి

పరీక్షలన్నీ దాటి ప్రవహించే కార్లతో బాటూ ప్రయాణిస్తున్నాను

యంత్ర జీవనంలో నేనూ ఇరుసై తిరుగుతున్నాను

రోజుదాటి రోజు- దివారాత్రులు

నువ్వు చూసే చలినూగు చందమామను

మంచుమొగ్గలు విరబూసే ఉదయాల్ని

నిన్ను తాకే వెన్నెల కెరటాల పరిమళాల్ని

నిన్ను తాకే మిట్టమధ్యాహ్నపు వెచ్చదనాన్ని

నేనూ అల్లుకునే వున్నాను

మందహాసం-

ఓదార్పు-

మోహావేశం-

ప్రేమైక పలకరింపు అన్నీ

ఆకాశమూ, సముద్రమూ, మంచు,వడగాల్పూ అయి

నన్ను చుట్టుముడుతున్నాయి

నిన్ను తాకే మంచుకొనల వర్షధారలు

నువ్వు తాకే తీగెచాటు హిమపుష్పాలు

అన్నీ వున్నాయి నా చుట్టూ

నువ్వు తప్ప-

……………

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s