వేసవి కాలిఫోర్నియా కబుర్లు

ఏం చెప్పను కాలిఫోర్నియా కబుర్లు-

నును వేడిమి చలిగా ముడుచుక్కూర్చుని….

ఇదేం వేసవో అర్థం కాని చలి-

గాలి సాయం లేకపోతే వీపు పగిలే సూటి ఎండ

ఏదీ- కానిస్తేనా?!

అంతలోనే బెంగెట్టుకున్నట్టు ఎండని తరుముకుంటూ మబ్బు-

మబ్బు తెరల సిగ్గు బంగారం గానూ- మురిపెపు గాలి ముసుగులేసుకుని మరీ వస్తుంది-

పేలగొట్టే భారత వేసవి-

అర్థరాత్రికీ చల్లబడని ఉక్కపోత-

కరెంటు పోగానే దోమల మోత-…ఏవిక్కడ?

చెవులకి తడి తువ్వాళ్లు చుట్టుకుని నేల మీద ఆదమరిచి నిద్రించే వేసవి మధ్యాహ్నాలేవీ ఇక్కడ…?

ఏ కాలమో తెలీని వేసం కాలం!- గమ్మత్తు గమ్మత్తుగా-

సబ్జాగింజల షర్బత్ లు- మామిడి పళ్ల ఘుమఘుమలు

రాత్రుళ్ళు ఐసుప్రూటు బండి గలగలలు-

ఆరుబయట మినుకులాడే చుక్కల లెక్కింపులు ఏవిక్కడ?

ఏవిక్కడ?

అసలు సముద్రానికి ఇంత వణుకు కెరటాలుంటాయా?

పాపం గజగజలాడ్తూ పడ్తూ లేస్తుందిక్కడ-

నీటి బాతుకున్న తెగువ మనిషికీ వున్నట్లు గజఈతగాళ్ల విసుర్లు-

ఎటు చూసినా ఆధునికత తాండవించే

రోడ్ల వెంబడి నడిచేందుకు కాస్త వేడిముంటేగా-

వేసవి ప్రవేశించే మిట్టమధ్యాహ్నం సూటి ఎండని

మఫ్లర చెవులు

జేబుల్లో దాక్కునే చేతులు ఏం చెబుతాయి?

కాలిఫోర్నియా నించి ఏం కబుర్లు చెప్పనూ…?!

తేడా లేని షాపింగ్ మాల్ లు—

ఎటు చూసినా ఒకేలా అగుపించే టౌన్ షిప్ లు…

రయ్యి రయ్యిన దూసుకెళ్ళే కార్లు…

మనిషి కరువైన చోట కబుర్లు లేని కాలిఫోర్నియా నించి ఏం చెప్పను?!

—————–

http://www.pranahita.org/2008/09/vesavi_california_kaburlu/

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

2 Responses to వేసవి కాలిఫోర్నియా కబుర్లు

  1. kalageeta అంటున్నారు:

    Thanks Uncle-

  2. Somayya Kasani అంటున్నారు:

    Dear Geetha:
    It’s a Wonderful description of the ‘Life in California USA’. Thanks for sharing to us, your fellowmen.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s