వైరుధ్య ఉగాది

ఏమ్మా! ఉగాదీ!
ఎలా ఉన్నావ్?
స.రపు కవర్ పేజీ వై
హడావిడిగా నడిచొస్తావ్ ప్రతీసారీ
నీ కోసం నాలుగు వ్యాసాలు రాయలేను కానీ
ఏదో- ఒక కవితని బహూకరించగలను-
ఇక్కడ మేం అంతా నీ పేరుని తల్చుకోగలం గానీ
నీ కోసం వేప చెట్లని పెకలించుకు రాలేం-
ఉగాదివంటూ సంబర పడగలం గానీ
మామిడి తోరణాల్ని అలంకరించలేం-
అదిగో ఎవరో-
ఇంటి నించి శుభాకాంక్షలు చెప్తున్నారు
ఆ వెనకే దూరంగా కోయిల కలకూజితం
లెతాకు పచ్చగా వీస్తున్న తొలి గ్రీష్మ మారుతం
ఉగాదీ! ఉగాదీ!
పోయిన వత్సరమంతా అతలాకుతలం
ఆర్ధికాగ్ని రగిల్చిన బడబానలం
అదుగో
వేల ఇళ్లల్లో ఉగాది/కాదు నిశీధి తాండవం
సంవత్సరాదికి లేదు సమాధానం
విరోధి ఉగాదీ!
వైరుధ్యాల్ని పరిష్కరించు
బతుకు కర్మాగారాల్ని కారుణ్యంతో తెరిపించు
అద్భుతాలు కాకున్నా- చిరు ఆశ నెరవేర్చు-
ఉగాదీ! అమ్మా ఉగాదీ!
అన్నట్లు మర్చిపోయాను-
నువ్వెలా ఉన్నావ్?
ఇవ్వేళ అద్దంలో తలవాల్చిన తామరపూవుని చూసేను
నువ్వేనా?
ఎప్పుడూ
పాల బుగ్గల తొలకరి చిర్నవ్వులై
మొలకెత్తే విత్తనపు తొలిపత్రాలై
మెరిసే నీ కళ్ళు-
ఇవేళ రెప్పలెత్తని ధ్యాన ముద్రలో వున్నాయెందుకో
దు:ఖ సముద్రాలెన్నో దాచుకోగల్గిన ధరణి తల్లివి-
నీకేం ఉపద్రవం వచ్చింది?
ఉగాదీ! ఉగాదీ!
అయినా మేం అందరం లేమూ?!
లేమ్మా! లేచి కాస్త ఉగాది పచ్చడి రుచి చూడు
సంభ్రమాశ్చర్యాల సంబరం కలుగుతోందా?!
ఇదే మరి జీవితం అంటే-
కొంచెం కన్నీట్లో రంగరించే ఆనందామృతం-
కాస్త సంతోషం లోనే ముంచేసే వేదనాశ్రుపేతం-
………….

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/august2009/index.html

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s