సరిహద్దు ప్రేమ

అతణ్ణి నేను గాఢంగా ప్రేమించాను
నా కలలన్నీ అతని చుట్టూ అల్లు కున్నాను
అతని ప్రాంగణం లో ఇల్లు కట్టుకున్నాను
మొక్కలు పెంచుకున్నాను
అతడు నన్ను ఏనాడూ అడగలేదు
ఎక్కణ్ణించి వచ్చావని?
అతడి భాష నేర్చుకున్నాను
అతడి సంస్కృతి వంటబట్టించుకున్నాను
బతకమ్మ బతకమ్మ ఉయ్యాల-
నీ బిడ్ద పేరేమి ఉయ్యాల-
నేను పదాల్ని వత్తి పలకడాన్ని ముసిముసి నవ్వులతో వెనకే తిరగేసేవాడతను
నేనేం చేసినా నా వైపే చూస్తూ తలపంకించే వాడతను
ఎన్నెన్ని రుచులు!
భక్షాలు, మురుకులూ-
జొన్నరొట్టె, వెల్లుల్లి కారం, కాళ్లు తలకాయ రసం-
ముళ్ళు గుచ్చుకునే శీతాకాలాలు
వాన ఆట్టే కురవని నేలలు

అతనికి మించి ప్రేమించే పిల్లల్నిచ్చాడు నాకు-
పాఠాలూ, పాటలు, పరుగులూ అన్నీ నేనే నేర్పించుకున్నాను నా పిల్లలకి-
నా పిల్లలు-
మొక్కజొన్న చేలో దొంగతనం చేసినా
చెట్లు విరిగేలా రేగుపళ్లు దులిపినా
జీడి పళ్లు ఎంచిఎంచి తెచ్చినా
శీతాఫలాలు బడిసంచీ నిండా నింపినా
అందులో అతనికి నా మీద ఉన్న అపారమైన ప్రేమ మాత్రమే కనిపింఛేది
నేనెక్కడో పెరిగానన్న బెంగ ఇట్టే మరిపించేది ఆ కౌగిలి-
ఇదే నా పుట్టినిల్లని అనుక్షణం తలపింపజేసేది అతని చిర్నవ్వు-

ఓ రోజు ఏమైందో నాకే తెలీదు
హఠాత్తుగా వచ్చి నా కారు అద్దాలు పగల గొట్టేడు
నా ప్రాంతంలో నీ ఉనికి ఉండకూడదన్నాడు
నా పిల్లలతోనే వెనక్కు వెళ్ళిపోవాల్సిందని ధర్నాలు చేయించాడు
కక్షలకూ కార్పణ్యాలకూ ఒకటే కారణం-
నేనెక్కడో పుట్టడం
అతనెక్కడో పుట్టడం
నా ప్రాంతం- అతని ప్రాంతం-
నేనెందుకు అతన్ని వదిలెళ్లాలో
నా ప్రేమంతా ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు
ఇప్పుడు అతని ప్రాంగణం లో నా ఇల్లు అన్యాయం-
నా మొక్కలు అధర్మం-
పనమ్మాయి ఇవేళ్టి నించీ మీ ఇంటి పనికీ, మీకూ “సెలవు” వెళ్లి రండంది
ఆటో వాలా ఆపకుండానే వెళ్లిపోయేడు-
గుమ్మాల్లోంచి ఈసడింపు చూపులు
కాలనీల నిండా ప్రాంతీయతా భేదాలు
నువ్వే వచ్చి అతణ్ణి దోచావంటున్నారు
నీ వల్లే అతడికి ఉద్యోగవకాశం లేదంటున్నారు
పండుగలకి సరిహద్దు దాటితే తిరిగి రానివ్వమంటున్నారు-
పెట్టేబేడా సర్దుకుని
సరిహద్దుకవతలకి ట్రాన్స్ ఫర్ చేయించుకుని
నేనెందుకెళ్లాలో
నేనెలా వెళ్ళాలో నాకే అర్థం కావడం లేదు
అతణ్ణి నేను గాఢంగా ప్రేమించాను
అతడి ప్రాంతీయ వాదాన్నీ ప్రేమిస్తున్నాను
నన్ను విసిరేయడం తప్ప-
———————

sarihaddu prema- andhra jyothy vividha –18-january-2010

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

3 Responses to సరిహద్దు ప్రేమ

 1. kalageeta అంటున్నారు:

  @David garu- Thank U very much- Ala ayite manchide kadandi-
  @Phani garu, Poem lo abbayi, ammayi iddaru rendu prantalu-
  vidipovalanna alochana enduko vallake teliyali mari-
  Thank U-

 2. phani అంటున్నారు:

  Hi madam
  Chaala bagundi me kavitha
  Vedipovalanna aalochana Atahniki ela vachnidi?
  E time lo saraina naayakudu avasaramani naa abirayam.

 3. డేవిడ్ అంటున్నారు:

  మేడం బ్రతుకు దేరువుకొసం వచ్చిన వాళ్ళను మేము వెల్లమని అనడం లేదు. ….మమ్ములను దోచికోవడానికి వచ్చిన వారిని వెల్లమని అంటున్నాము…. మా సంస్కృతిని గౌరవించే వారీతో మాకు విభేదాలు లేవు, మా సంస్కృతిని కించపరిచే వారితోనే మాకు విభేదం. ఎవరో కొందరు చేస్తున్న దాడులను అందరి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s