శతాబ్ది వెన్నెల

శతాబ్ది వెన్నెల
నాలో మహావృక్షమై నరనరాల్లో నాటుకున్న
ఒక చిరు బీజం-
అంతర్లీన సరస్సులో ఈదులాడే చేపపిల్ల-
నిశ్శబ్ద కుహరంలో తొమ్మిది నెల్లుగా నిద్రపోతున్న పసిపాప-
ఇప్పటికీ బీడువారని క్షేత్రాన్నై
మొలకెత్తే చిరునవ్వు చిరునామానై- నేను-
ఎలా వున్నావు పాపాయీ?
ఎప్పుడూ ఆశ్చర్యమే- ఎప్పుడూ విచిత్రమే-
తెరలు తెరలుగా నలుపు తెలుపుల్లో కదిలే నిన్ను
వీక్షించినప్పుడల్లా కడుపారా ప్రవహించే మాతృత్వ మధురానుభూతి-
నీ కోసం ఎన్నెన్ని జాగ్రత్తలు!
కుంకం పువ్వు, నారింజ రసం-
ఒమేగాలు, ఫోలిక్ ఆసిడ్ లు- క్రమ తప్పని టైం టేబుళ్ళు-
నువ్వు చిరు మెత్తగా రెక్కలు విదిల్చి
గజఈత నేర్చినట్లు గింగిరాలు కొట్టి
పుట్టకుండానే పరుగు నేర్చినట్లు పిడి గుద్దులు గుద్ది
నన్ను నిలువెల్లా పాలు ప్రవహించే అమ్మని చేస్తావు
పాపాయి కదలికే ప్రాణమైన ప్రపంచాన
క్షణాలన్నీ కడుపుకి చేరువై పొట్ట తడిమే చేతులవుతాయి
ప్రేమంతా వేళ్ల లోకి ప్రవహించి
స్పర్శ తోనే తొలిపరిచయాలవుతాయి-
కళ్లు తిరగడాలు, వాసనల వికారాలు
వాంతులు, లేవలేని తనాలు
నెలకో బాధ నిలబడనీకుండా చేసినా
ఎటు ఒత్తిగిల్లీ నిద్రపోలేకున్నా
బైటి లోకపు ద్వారపాలకురాలినై
రాత్రింబగళ్లు నీ కోసమే పహారా కాస్తున్నా-
నువ్వు కళ్లు విప్పే తొలి కాంతినై నిన్ను చుట్టు కోవడం కోసమే అన్నిటినీ తట్టుకుంటున్నా-
చిరు చిన్న పాపాయీ!
మనిద్దరం ఒకే శరీరపు రెండు భాగాలం
నిజానికి నాలో నువ్వున్నా
నీ కడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం-
వత్సరాలు ఎన్నో గబగబా దాటెళ్ళి పోయినా నీ రూపంలో నేను మళ్లీ ఓ వందేళ్లు పోగు చేసుకుంటాను
నీ నించి ప్రవహించే రక్తమై పరిణామం చెంది
శతాబ్దాల తరబడి జీవించే వుంటాను
కృతజ్ఞతలు పాపాయీ!
శతకోటి కృతజ్ఞతలు-
ఆకాశంలో నక్షత్రానివై మెరిసే నువ్వు
శతాబ్ది వెన్నెలవై నాలో ప్రవర్థమానమవుతున్నందుకు
అందరి పెదాల మీద తడి తళుక్కువై
ఇల్లంత కేరింతవవుతున్నందుకు-
………………………

http://www.koumudi.net/Monthly/2010/august/index.html

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

1 Response to శతాబ్ది వెన్నెల

  1. sunamu అంటున్నారు:

    I think you have touched this subject after a very long time … and perhaps, only the second one to write after Doppalapudi Anasuya Devi’s Baalenta Polapamu, last century.

    Congrats.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s