అమ్మ వెళ్లేక

ఆరు నెల్ల తర్వాత మళ్లీ
గడియారం చప్పుడు ఇంటి గోడల్ని తీవ్రంగా తాకుతూ-
నిన్నటి దాకా ఏవేవో కబుర్లుండేవి
మాటల్లో ఏమి దొర్లినా
మనసుల మధ్య
అమ్మకు, నాకు మధ్య ఏదో ఆనందం పెనవేసుకునుండేది
తెల్లారి తన గదిలోకి వచ్చానా-
విడిచిన చలి కోటు, మఫ్లరు, గ్లోవ్స్ ఆప్యాయంగా తడిమాయి నన్ను
ఆ  మూల తన మంచమ్మీద నడుం వాల్చానా-
మెత్తని ప్రేమైక చేతులు నా చెంపలు నిమిరాయి
ఎయిర్ పోర్టు చెకింగ్ పాయింట్ లో
నా భుజమ్మీద కరడు కట్టిన అమ్మ కన్నీళ్లన్నీ
నా కన్నీళ్లై ఈ గది లోనే ప్రవహిస్తున్నాయి
ఓ ప్లాస్టిక్ పూల తీగో
సువాసన కొవ్వొత్తి దీపమో చూస్తే సంతోషపడిపోయి
తనకే కావాలని తపించేది
ఎంత చిన్న కోర్కెలు!
అమ్మ వున్న ఈ ఆరు నెల్లు
పిల్లలకు నాకు మధ్య ఒక కొత్త అనుబంధం
మమ్మల్ని ఇంకాస్త దగ్గరికి నేస్తూ-
పసిపాప మాకు కొత్త ప్రాణమైంది
మేం ముగ్గురం ఒక కేంద్రం నించి ఉద్భవించి
ఒక పుష్పానికి మూడు రేకులై ఒకర్నొకరు చూసుకుని మురిసిపోయే వాళ్లం
చలేస్తే ఒకరి రెక్కల చాటున మరొకళ్లం దాక్కుని గువ్వపిట్టలై కువకువ లాడుకునే వాళ్లం
కిటికీలో వెల వెల బోతున్న బొట్టు బాక్సు, మందుల పెట్టె
గదంతా బావురుమంటున్న సామాన్ల వెల్తి
ఏదో ఇల్లు ఖాళీ చేసినట్లు-
కాస్సేపు ఇంకెక్కడో వుందిలే-
నిశ్శబ్దంగా రాసుకుంటూనో-
పుస్తకాలు చదూకుంటూనో-
కాఫీని నెమ్మదిగా తాగుతూనో-
అలా అపార్ట్ మెంట్ చుట్టూ అడుగులేస్తూనో-
గదిని ఖాళీ చేసినా మనసుని ఖాళీ చేయలేని నిస్సత్తువ-
క్షమించు అమ్మా!
ఆరునెల్ల కంటే ఎక్కువ పరాయి దేశం పర్మిటించదు
ఒకసారి నీనించి విడిపడిన పుత్రికా రత్నం నీతో వెనక్కి ప్రయాణించదు
అయినా చివరి నిముషంలో వెనకే పరుగెత్తిరావాలనిపించింది
మళ్లీ ఓసారి నీ కడుపులోకి ప్రవహించి హాయిగా నిద్రించాలనిపించింది
ఆరునెల్లు సరిగా చూసేనా?
సంతోషంగా గడవనిచ్చేనా?
ఆరురోజులై గడిచిన ఆరునెల్లలో
కనీస సంతృప్తిని మిగిల్చేనా?
ఏవోవో నిశ్శబ్దాలు
గడియారం చప్పుడు మాత్రమే గోడల్ని తీవ్రంగా తాకే
గదిలో-
ఏవేవో ఆలోచన్లు
గడియారం చప్పుడుతో పాటూ
గోడల్ని తీవ్రంగా తాకుతూ-
………………………

http://www.koumudi.net/Monthly/2011/may/index.html

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

6 Responses to అమ్మ వెళ్లేక

 1. kalageeta అంటున్నారు:

  Thanks Madhavi garu-

 2. Madhavi అంటున్నారు:

  అద్భుతం అండీ…

 3. kalageeta అంటున్నారు:

  Thank you very much Indrani garu-

 4. kalageeta అంటున్నారు:

  Thanks Malliswari garu, Ela Unnaru?

 5. jajimalli అంటున్నారు:

  బావుంది గీతా…
  అమ్మంటే…ఉట్టి అమ్మ కాదు గదా…వరాల’మ్మ కదా…
  నీ వేదన సహజమే….
  మల్లీశ్వరి

 6. Indrani Innuganti అంటున్నారు:

  Very touching…….అమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలనే బలమైన భావన….చాలా బాగుంది అనేది చాల చిన్న మాట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s