ప్రపంచం కన్నా పాపాయి గొప్పది!

ప్రపంచం కన్నా పాపాయి గొప్పది!
ఏ ప్రపంచం కన్నా నా పాపాయి గొప్పది!
ప్రపంచానికి తెల్లవారిందంటే పరుగులే పరుగులు
మా ప్రపంచానికి తెల్లవారిందంటే మురిపాల కేరింతలు
లేస్తూనే దుప్పటీ ముఖానేసుకుని బూచాటలాడుకుంటాం
పడ్తూ లేస్తూ నడిచే పాపాయీ, నేనూ ఇంట్లోనే తిరిగే  ఇంజనూ, కూబండీ
నా పైనే ఆధారపడ్డ  చిన్ని ప్రాణం
ఆకలేసినా నిద్రొచ్చినా ఆత్రంగా నా చెంపలు చీకుతుంది
అనుక్షణం నన్నంటిపెట్టుకుని వుండే చంటిబిడ్డ
ఎటు నడిస్తే అటు పాక్కుంటూ వచ్చి నాకేసి చూస్తూంటూంది
గుండెలకు హత్తుకుంటే కితకితలు పెట్టినట్టు కిలకిలా నవ్వుతుంది
పాపాయినెత్తుకుంటే ఇంకేమీ అక్కరలేదీ జీవితానికి అనిపిస్తుంది
అమ్మ జీవితానికి అర్థం లేని అన్వేషణలు
ఏవేవో అంతు పట్టని లక్ష్యాలు
పాపం పాపాయికివేం లేవుగా- అమ్మ తప్ప
కాస్త బొజ్జ నింపే అమ్మ కోసం
భుజాన జోకొట్టే ప్రాణి కోసం
గదిగదినా వెతుక్కుంటూ తిరుగుతుంది రోజంతా
క్షణం కనిపించకపోతే కింక పెట్టి దిక్కులు చూస్తుంది
కంప్యూటరు యుగంలో పుట్టానని పాపాయికేం తెల్సు?!
అక్షరాలు పరుగెత్తే వేగం
మారిపోయే లోకాన్నందుకోవల్సిన తరుణం
జీవితం వృథా అయిపోతున్న నిర్వేదం
ఉనికి, వ్యక్తిత్వం
ఆత్మస్థయిర్యం, అంతర్మథనం
అమ్మ కళ్లల్లో ఊగిసలాడే కోటానుకోట్ల స్వప్నాలు పాపాయికేం తెల్సు?!!
ప్రపంచం కన్నా పాపాయి గొప్పదని
అమ్మకి చెప్పేవాళ్లు లేరని పాపాయికేం తెల్సు!?
యంత్రం ముందు కూచునే మర బొమ్మల ప్రపంచంలో
పాపాయి చూసి చూసి విసుగెత్తి బోర్లా పడుకుని వేళ్లు జుముక్కుంటూ వుంటుంది
ఎంతకీ ఎత్తుకోని అమ్మని చూసి కళ్లు పిండుకుని ఏడ్పులంకించుకుంటుంది
కుర్చీని పట్టుకుని నిలబడ్డట్టే నిలబడి
దొరికిన చోట దొరికినట్టే
మునిపళ్లు దిగేలా కొరికి
తనని ఎవరో కొరికినట్లు బెంబేలెత్తిస్తుంది
పాపాయికి పొట్ట నిండా విద్యలే
ఏం చేస్తే అమ్మకి వినిపిస్తుందో
ఎక్కడివక్కడ వదిలి పరుగెత్తుకొస్తుందో
అన్నీ తెలుసు
చిన్ని చిన్ని పాల పళ్లేసుకుని
రెండు చేతులూ బుగ్గల మీదేసుకుని
ప్రపంచంలోని సంతోషమంతా ఉట్టిపడేట్టు కిలకిలా నవ్వే పాపాయికంటే
మెడని కావలించుకుని ఒళ్లో కూచుని గుండెకి తలాంచుకుని
స్థిమితం గా సేదతీరే పాపాయికంటే
ప్రపంచం గొప్పదా?!
జీవితంలో అన్నీ వస్తాయి
చదువులు, చట్టుబండలు
కంప్యూటర్లు, కాకరకాయలు-
ఉద్యోగాలు, ఊళ్లేళ్లడాలు-
మళ్లీ రానిదొక్కటే
పసిపాపతో గడిపే సమయం-
………….

(విహంగ- నవంబరు,2011 ప్రచురణ)

http://vihanga.com/?p=1645

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

6 Responses to ప్రపంచం కన్నా పాపాయి గొప్పది!

 1. kalageeta అంటున్నారు:

  Thanks Baba garu-

 2. kalageeta అంటున్నారు:

  Thanks for your comment Madhavi garu-

 3. Madhavi అంటున్నారు:

  చాలా బాగా చెప్పారండీ…. ఇది అందరికీ సాధ్యం కాదు ఇంత విలువైన సమయాన్ని కేటాయించడం…
  ఎవరికి తగ్గ పాట్లు వారు పడతారనుకోండీ…. కానీ మీ వివరణ బాగుంది..

 4. kalageeta అంటున్నారు:

  Thanks Vanaja garu-

 5. vanajavanamaliv అంటున్నారు:

  Adbhutamgaa.. cheppaaru.abhinandanalu.
  jeevitamlo.. annee aanaka vasthaayi.baalyam thappa. bosinavvulu,thappatadugulu,muddu muddu maatalu aaswaadinchani ammatanaaniki yenni unte yemiti?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s