ఎగిరొచ్చిన ఇల్లు

వేన వేల మైళ్లు ఎగిరొస్తేనే గానీ నా ఇల్లు నాకు కనిపించలేదు

అద్దె ఇల్లో, నాల్గు గదులో ఏదైనా గానీ

నా ఇల్లు -నా కలల ఇల్లు

నేను, నా పిల్లలు కలిసి హాయిగా ఆడుకునే ఇల్లు

నా ప్రేమికుణ్ణి నచ్చినప్పుడు ముద్దుపెట్టుకునే ఇల్లు

పుస్తకాలన్నీ షెల్ఫ్ లోంచి కిందకు సగం దూకుతున్నా

బోర్డు గేములు ఇల్లంతా తలో మూలా దొర్లుతూన్నా

బాల్కనీ లో డైసీ పూల చిర్నవ్వు గదులలో విరబూస్తుంది

లాండ్రీ బట్టలు బుట్టలు నిండినా

ఎక్కడి పనక్కడ ఎప్పుడూ మిగిలిపోతూన్నా

వేన వేల మైళ్లకివతల నా ఇంట్లో

పిల్లల అల్లరి నవ్వుల్తో  సముద్ర కెరటాలు  గోడల్లో ప్రతిధ్వనిస్తాయి

అందరం ఒక దుప్పట్లో కూచుని  చలి మంట కాచుకునేటప్పుడు

వెచ్చని సూరీడు  మా అరచేతుల్లోనే ఉదయిస్తాడు

ఇంటి నిండా గోడలకు రంగుల రెక్కలొచ్చినట్లు

అబ్బాయి గీసిన చిత్రపటాలు

అమ్మాయిలు వేసిన అరచేతి ముద్రలు

ఉండుండీ వాయిద్యాలపై కోయిలలు  వాలినట్లు

గొంతులన్నీ కలిసి ఎగిసే యుగళ గీతాలు

ఉధృత జలపాతం అప్పటికప్పుడు కనువిందు చేస్తుంది

వంటింట్లో ఘుమ ఘుమలు

సోఫాల మీదే పడకలు

గంటల తరబడి కబుర్లు

ఇంట్లో నిత్యం ప్రవహించే సెలయేళ్లు

ఎప్పటి జీతం రాళ్లు అప్పుడే ఖర్చయ్యిపోయినా

బొటా బొటీ భవిష్యత్తే కనుచూపు మేర కనిపిస్తూన్నా

అనుక్షణం  అపురూప  జీవితం వేల మైళ్లకివతల లభ్యమైంది

అన్నీ ‘నా’ వైన నా ఇంట్లో పుట్టిన రోజులకు కంప్యూటర్లు ముఖచిత్రాలు గీస్తాయి

కలర్ ప్రింటరు అచ్చు గుద్ది ఆదరాబాదరాగా అందిస్తుంది

సీగల్ పక్షులొచ్చి రంగు రిబ్బన్లు, గాలి బెలూన్లు కడతాయి

ఇంటి ఆవరణలో నర్మగంభీరంగా నిల్చునే రెడ్ వుడ్ చెట్లు

పొట్టి  చేతులేసుకుని  పాటల వీవెనలు వీస్తాయి

ఊళ్లు తిరిగే సెలవులు

దుకాణాల్ని చుట్టే వారాంతాలు

ఉడుతల్లా తరుముకునే పగళ్లు, రాత్రుళ్లని

బహూకరిస్తాయి

ఒకోసారి పిల్లలు మాట వినరు సరి కదా ఎదిరించి అరుస్తారు

ప్రేమికుడు హఠాత్తుగా మొగుడై  అడ్డదిడ్డంగా వాదిస్తాడు

అప్పుడు ఆల్బముల్లోంచి అప్పుడే ఉద్భవించిన పసికూనలు నడచుకుంటూ వస్తారు

ప్రేమలేఖలన్నీ గతపు సువాసనల్ని రెపరెపలాడించుకుంటూ ముస్తాబై వచ్చి ఒళ్లో కూచుంటాయి

తిట్టుకున్న కళ్లల్లోనే అనంతమైన ప్రేమ జనిస్తుంది

అరిచే పిల్లలు అంతలోనే చుట్టూ చేరి ఆత్రంగా అల్లుకుంటారు

జాబిల్లి నక్షత్రాలన్నీ ఏరి తెచ్చి   ఇంట్లో తోరణాలు కడుతుంది

వెన్నెల పసిపాపై మా ఇంట పాకుతుంది

ఒకరి పై ఒకరు  ఆధారపడ్డ అయిదు ప్రాణాలకు ఇల్లే పంచ ప్రాణాలై

ఒక్క ప్రాణమై

వేన వేల మైళ్లకివతల ప్రత్యక్షమవుతుంది

*********

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

12 Responses to ఎగిరొచ్చిన ఇల్లు

 1. kalageeta అంటున్నారు:

  Thanks Ramu garu-

 2. kndukuri ramu అంటున్నారు:

  beautiful presentation

 3. kalageeta అంటున్నారు:

  లలిత గారూ,
  మా ఇంటి విశేషాలు మీ బ్లాగ్ లో చూసి భలే సంతోషం వేసింది. మా ఇంటికి నేనే వెళ్లినంత- మా అమ్మ సంతకాన్ని భద్రంగా దాచుకున్నందుకు, మీ స్పందనకు ధన్యవాదాలు.
  మీ కథ చదివేక మెయిల్ చేస్తాను-

 4. lalitha అంటున్నారు:

  హలో గీత గారు ,
  మీ కవిత చాలా బావుంది . విహంగ లో చదివినప్పుడే చెప్పాలనుకున్నా
  మరోమాట మీరు నాకు తెలుసు . ఎలా అంటే …….

  http://naaspandhana.blogspot.in/2011/11/blog-post.html ఇక్కడ చూడండి .

 5. గీత గారూ,
  Thanks. తప్పకుండా చేర్చండి. మీ 21వ శతాబ్దపు తెలుగు బ్లాగ్‌లో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లున్నాయి. కొద్దిగానే చూశాను. తీరిక దొరకగానే తిరిగి చూస్తాను. బావుంది.

 6. kalageeta అంటున్నారు:

  లలిత గారూ- చాలా చాలా మంచి పని చేస్తున్నారు మీ బ్లాగ్ ద్వారా. నా 21వశతాబ్దపు బ్లాగ్ లో మీ http://telugu4kids.com ను చేర్చుదామనుకుంటున్నాను. మీరనుమతిస్తే-

 7. గీత గారూ, కొత్తపల్లి పిల్లల పత్రిక ఆలోచన నచ్చినందుకు సంతోషం. ఐతే ఆ అభినందనలు ఆ పత్రిక బృందానికి చెందుతాయి. “మా ఇల్లు” బావుందన్నందుకు Thanks. నేను కొత్తపల్లి పత్రికకి అప్పుడప్పుడూ రచనలు పంపుతుంటాను. పిల్లల కోసం నేను నడుపుతున్న website : http://telugu4kids.com
  నేను చెప్పడం మర్చిపోయాను. ఈ అనుభవాలు అందరికీ ఉంటాయేమో కానీ మీరు వ్యక్తపరిచిన తీరు చాలా బావుంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.

 8. kalageeta అంటున్నారు:

  కవిత మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ వనజ గారూ, లలిత గారూ, చిన్నా-
  లలిత గారూ- మీ కవిత “ఇల్లు” చాలా బావుంది. పిల్లల కోసం ఈ- పత్రిక ఎంత మంచి ఆలోచన!

 9. Geeta gaaru, I guess I got the meaning of that line now.

 10. చాలా బావుంది. మేము అపార్టుమెంటులో ఉండే రోజులు గుర్తుకు వచ్చాయి. కొన్ని సార్లు (చాలా తక్కువ) వేరే కారణాల వల్ల విసుగనిపించినా నాకు ఆ ఇల్లంటే ఎంతో ఇష్టం. అక్కడ మేము ఇలాగే సమయం గడిపే వాళ్ళమని మీకెలా తెలిసింది? 🙂
  “అప్పుడు ఆల్బముల్లోంచి అప్పుడే ఉద్భవించిన పసికూనలు నడచుకుంటూ వస్తారు” అబ్బా, ఇది నాకు చాలా దగ్గరగా అనుభవమైంది. రోజులు దొర్లిపోతుంటాయి. పిల్లలు ఎదుగుతున్నారని ఏవో నేర్పించాలని ప్రయత్నిస్తూ కోపాలు తెచ్చుకుంటూ రక రకాలుగా parental responsibilites, affection మధ్య మునిగి తేలుతున్నప్పుడు మా పిల్లలు పసిపాపలుగా ఉన్నప్పటి ఫోటోలు చూసి వాళ్ళు “పిల్లలని” గుర్తు తెచ్చుకున్న క్షణాలు జ్ఞాపకమొచ్చాయి.
  ఒక చిన్న సందేహం. “వేన వేల మైళ్లకివతల ప్రత్యక్షమవుతుంది ” ఇది వివరించగలరా?
  నేను వ్రాసుకున్న “ఇల్లు” ఇక్కడ చూడగలరు.
  http://kottapalli.in/2010/10/%E0%B0%AE%E0%B0%BE_%E0%B0%87%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81

 11. Vanaja Tatineni అంటున్నారు:

  అందమైన ఆనందాల పొదరిల్లు. అవును ఇల్లు అంటే అచ్చు ఇలాగే ఉండాలి. వెరీ నైస్

 12. SL అంటున్నారు:

  You got home.Congratulations.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s