వేయి వ్రణాల ఆయుధం

“వేయి వ్రణాల ఆయుధం” కవయిత్రి కె.గీత స్వరంతో ఇక్కడ వినండిImage

వేయి వ్రణాల ఆయుధం                                                       డా||కె.గీత

మరణం ఒక శిలాశాసనం

పుట్టగానే ఎక్కడో ఒకచోట పాతిపెట్టబడి ఉంటుంది

శిరసా వహించాల్సిందే

అనుక్షణం అడుగు వెనకే పడే మచ్చ మరణం

జీవితం వెనకాల చెరగకుండా వెంటాడుతుంది

ఆకు చివర వేలాడే మంచు బొట్టులా మరణం అంచున వేలాడే జీవితం

అయినా జీవితం మరణం కంటే గొప్పది

ఆఖరి క్షణం వరకు పోరాడాల్సిందే

శరీరమా! ఏడవకు-

లోపల నీకే తెలీని ఒక నిశ్శబ్ద ఘోర యుద్ధం

చడీ చప్పుడూ లేకుండా కణాల్ని పాకిన వ్రణం

మరణం ఎప్పటి నుంచో గద్దలా కాపు కాసి ఉన్నా

పొద పక్కనే చిరుత పులిలా పొంచి ఉన్నా

జీవితం అగ్నిలా రాజుకోనీ

శరీరమా దు:ఖించకు-

మనసులో ఎగిసి పడే మమకారాల పట్టికకు కన్నీళ్ల మరకలే మిగల్చకు-

పిచ్చి పట్టినట్లు జీవితం కోసం మానేసి సౌందర్యం కోసం రోదించేలా చెయ్యకు

అయినా ప్రియతమా ఏదో పిచ్చి దు:ఖం!

రేపు నే నిద్రించిన స్థానే కొత్త శరీరం నిద్రిస్తుందా!

నా నగలు, చీరలు మరో శరీరం అలంకరించుకుంటుందా!

నన్ను చుట్టు ముట్టే నీ వెచ్చని చేతుల్లో నా బదులు–

ఎన్నెన్ని చేదు విషపు ముళ్ల ఆలోచనలో నా శరీరం నిండా

వాస్తవం కంటే ఎక్కువగా ఎటు ఒత్తిగిలినా గుచ్చుకుంటూ-

లేదు- లేదు నేను మరణించలేదు-

ప్రాణం కంటే వణికించే వైద్యం భయం

ప్రియతమా! ఏమని చెప్పను నీకు?

నిన్ను ప్రతిరోజూ హత్తుకున్న నా గుండెలు మాయమైనా

నా హృదయం ఇంకా మిగిలే ఉంది

పిల్లలకి మమకారపు పాలు పంచుకున్న చోట

అమ్మ గుండెకి  బదులు నాన్న గుండె ప్రతిష్టించబడింది

కీమో లు, రేడియేషన్ల పర్వంలో

లోపలేం జరిగినా  పైపైని జుట్టు పొట్టై రాలిపోయింది

అయినా నా సౌందర్యం

హృదయం లో నా సౌందర్యం ఎక్కడికీ పోలేదు-

నేనింకా మరణించలేదు-

సౌందర్యం మాట దేవుడెరుగు శరీరం తిప్పికొట్టిన ప్రతీసారీ

పేగుల్ని పైకి తోసే కక్కులొకటి

ప్రియతమా! నన్ను రక్షించు

ఇంకేదైనా సులభ మార్గం చూపించు-

ఎన్నో సార్లు వెనక్కీ ముందుకీ లోలకంలా ఊగుతున్న ఆలోచనలు

దుస్సప్నం కంటే బాధించే వాస్తవాలు

సకల కళా నేర్పరులకూ మినహాయింపు లేదా!

నేనే కొరడానై ఝళిపించిన రోజులకు ఇక తావు లేదా!

పైకి కనిపించే కళల వెనుక

కలల్ని దోచేసిన కేన్సరు క్రిమి

ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది

పసిదానికి నోరైనా రాలేదే

పెద్దబ్బాయికి ఇంకా పదేళ్లేనే

భగవంతుడా! నా పిల్లల్ని శిక్షించకు-

ముక్కు పచ్చలారని పసి పిల్లలకి అమ్మని దూరం చేయకు-

మరణం కంటే బాధించే జీవితాన్ని ఈ శరీరానికి మిగల్చకు-

లేదు- లేదు-

ఏమీ భయం లేదు-

జీవన పరమ పథ సోపానం లో విరిగిన మెట్లని సరిచేసుకోపోతే ఎలా?

వ్యధా రోగం పట్టినట్టు నిత్యమూ వృధా రోదిస్తే ఎలా?

జీవించేదెన్ని క్షణాలైనా అనుక్షణమూ మరణిస్తే ఎలా?

శరీరమా!

పుష్పించు-

కణాలలో, కళ్లల్లో ధైర్యవిశ్వాసాల్ని నింపు-

వేయి వ్రణాలైనా లెక్క చేయని ఆయుధమై మొలకెత్తు-

మరణ శాసనాలు దద్దరిల్లేలా జీవన నగారా మోగించు-

***********

(బ్రెస్ట్ కేన్సరు బాధితులకి-)

Published by Andhra Jyothi Sunday 25-Mar-2012

http://www.andhrajyothyweekly.com/index.asp?page=Page16

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , , . Bookmark the permalink.

5 Responses to వేయి వ్రణాల ఆయుధం

 1. the tree అంటున్నారు:

  chaalaa bhaaga raasaarandi.

 2. kalageeta అంటున్నారు:

  Tappakunda prayatnistanu Murthy garu- Chala ardram ga unnayi mii kavita loni vakyalu-
  Kavita rasi dhanyuralinayyanu-

 3. sunamu అంటున్నారు:

  గీత గారూ,
  మీ కవిత మీ స్వరంలో వింటుంటే చాలా బాగుంది. మీరు మీ కవితలన్నింటినీ ఇలా present చెయ్యడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ కవిత మనసుని చాలా హత్తుకుంది.
  మా చిన్నక్క… Breast Cancer బాధితురాలు. ఆమె 1970 లో చనిపోయింది. అప్పటికి ఈపాటి వైద్య సదుపాయాలూ లేవు. ఆమె పిల్లలకి అప్పుడు 5,3, 1 సంవత్సరాలు. మా ఇద్దరికీ ఎంతో స్నేహం. నేనంటే ఆమెకి వల్లమాలిన అభిమానం. కొంచెం స్వగతమైనా, జ్ఞాపకం అన్న నా కవితలోంచి ఆమె మీద రాసిన రెండు ముక్కలు:

  “బాగా జారడం కోసం
  జారుడుబల్లమీద ఇసకపోసుకుని మరీ జారి,
  నిక్కర్లు చించేసుకుంటే,
  నాన్న కోప్పడతాడని ఆతృతతో వచ్చి
  “వెధవాయ్! ఎన్ని దెబ్బలుతిన్నా బుధ్ధిరాదు”
  అని ప్రేమతో మందలిస్తూ,
  పరికిణీ వీపునిండా కప్పనట్టేకప్పి –
  ఇంట్లోకి తీసుకుపోయిన చిన్నక్కలాంటిది జ్ఞాపకం”

  మళ్ళీ మరోసారి కళ్ళనీళ్ళు పెట్టించారు. అయినా మా అక్కని తలుచుకోడం ఆనందమే.
  కృతజ్ఞతలతో
  మూర్తి.

 4. kalageeta అంటున్నారు:

  Thanks for your comment Rasajna garu-

 5. రసజ్ఞ అంటున్నారు:

  వాళ్ళ బాధనంతా కళ్ళకు కట్టినట్టు చూపించారు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s