చెవిలో ప్రశ్న

కొత్త సంవత్సరం వచ్చి ఆత్రంగా కౌగిలించుకుంది

భుజమ్మీంచి వెనక్కి  తలూపుతూ వెళ్లిపోతున్న పాత రోజులు

కొన్ని సంతోషాలు

కొన్ని దు:ఖాలు

కొన్ని నిర్లిప్తాలు

ఏం సాధించాను?!

ప్రతి రోజూ రాత్రి చెవిలో మెదిలో ప్రశ్న-

పరుగులు ఉరుకులు

గదిలోంచి గదిలోకి

ఇంటి నుంచి బయటకు

బయట నుంచి ఇంటికి

ఎక్కడైనా ఒక్క నిమిషం ఆగానా?!

కాలం ముళ్లు పట్టుకుని వేళ్లాడీ, ఎగబ్రాకీ…

దూరంగా ఎవరో పిల్ల రెండు పిలకలేసుకుని

అయిసు ప్రూటు తినుకుంటూ ఇటే చూస్తూంది

ఇటాలియన్ అయిసు క్రీము తిన్నప్పుడల్లా

కంట్లో గుచ్చుకునే  అయిదు పైసల పుల్లయిసు

వీథి మలుపులో ఎక్కడో ఎత్తేసిన నీళ్లబిందె

సొట్ట పడి ఇంకా అక్కడే గుండ్రంగా తిరుగుతూంది

దాహం తీర్చుకోవడానికి తలెత్తినప్పుడల్లా గొంతుకడ్డం పడే  సీసాల నీళ్లు

టబ్బెడు నీళ్ల స్నానాదికాల్లో పాదాలకు అంటుకునే మా ఊరి చెరువుగట్టు బురద

ఎక్కడాగాలి?!

ఎక్కడ జీవించాలి!?

ఎవరో ఇటు నడిచి వస్తున్నారు

ఇప్పుడే ఒక కొత్త ప్రపంచంలో జన్మించినట్టు

సంభ్రమంగా, ఆకాశం కేసి చూస్తో

చెరగని దరహాసం

అలుపెరగని ఆత్మ విశ్వాసం

ముందంతా గెలుపేనన్న ఆశావేశాలు

అయ్యో! ఎవరో కుమిలి కుమిలి దు:ఖిస్తున్నారు

జీవించడం భారమయ్యో

భారమే జీవితమయ్యో

ప్రతి రోజూ

రోజుకొక విన్యాసం

రోజుకొక యుద్ధం

ఎక్కడైనా ఆగానా?!

వెను తిరిగి చూసేనా?

కాలం కాళ్లు పట్టుకుని వేళ్లాడీ, ఎగబ్రాకీ…

కొత్త సంవత్సరం ముందు కొచ్చినప్పుడల్లా మరో సంవత్సరం వెనక్కి వెళ్లే రోజులు

ముందేం ఉంటుందో ఎక్కడాగిపోతుందో తెలీని అలుపెరగని బాట

అదిగో అమ్మ అరుస్తోంది- పరుగెత్తాలి

ఉప్పూ, కారం, నూనే కలిపి- బడికి పట్టుకు పోయినట్లు ఎలా తెలిసి పోయిందో!

నాన్న చేతిలో జూక రాక్షసరౌద్రంగా వెంటబడుతోంది

జేబులో రూపాయి పావలా మాయమైనట్లు లెక్కెలా తెలిసిందో!

నాన్న పేకాట రహస్యం అమ్మకు,

అమ్మ రహస్యపు చీటీ వేలంపాట నాన్నకు

ఎవరందించారబ్బా!

పెందరాళే  పడుకోవాలి

పొద్దున్నే లేవాలి – వినబడిందా!! ఈ పిల్లకు ఎందుకు  నిద్రెందుకు  రాదో

రాత్రి కళ్లల్లో కలల్లో ఉదయపు మీటింగులు, వారాంతపు డెడ్ లైన్లు

పెందరాళే పడుకోకపోయినా

పొద్దున్నే లేవాలి

ఇవేళ ఏం జరుగుతూందో తెలీదు

నిన్నేం జరిగిందో గుర్తులేదు

ఉరుకులు పరుగులు

ఇంటి నుంచి బయటికి

బయటి నించి ఇంటికి

ఇవేళ్టి నుంచి  సంవత్సరాంతానికి

…………………..

Published by Sujana Ranjani May,2012

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may12/kavita-4.html

ప్రకటనలు
This entry was posted in కవితలు. Bookmark the permalink.

2 Responses to చెవిలో ప్రశ్న

  1. kalageeta అంటున్నారు:

    miku naccinanduku chala thanks-

  2. the tree అంటున్నారు:

    nice one.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s