ప్రవహించే సూర్యోదయం

నిన్న నువ్వు పంపిన సూర్యోదయం అందింది
రేపుదయానికల్లా నీకు అందజేస్తానూ-
పక్షులన్నీ ప్రయాణం ప్రారంభించాయి
గూడకాకి ఆశగా కూస్తోంది ఒంటరిగా-
తిరిగి మాట వినిపిస్తుందేమోనని
పాపం రాత్రి నిన్ను కౌగలించుకున్నట్లుంది మంచుగా
ఒక నీహారిక ఆకు చివర్నించి రాలుతూ చెప్పింది
నిజానికి మెలకువ కంటే నిద్ర ఎంత సౌఖ్యమో
నిన్ను నా చెవికానించి కబుర్లు వినిపిస్తుంది
నిన్ను తలదిండుని చేసి హాయిగా జోలపాడుతుంది
పగలంతా బెంగ వేళ్ళాడే క్షణాలన్నీ నిద్రతో కుమ్మక్కై
తటాలున ఎగిరిపోతాయి
మధ్యలో ఎప్పుడో ఏదో గుండె పిల్చినట్లై
ఫోను చేస్తే
మధ్యాహ్న మార్తాండుడిలా “ఐ యాం ఇన్ ఎ మీటింగ్- కాల్ యూ లేటర్” అంటావు
ఎండ పొద్దెక్కి బారెడైన పదకొండింటికి
చీకటైంది నిద్రొస్తోంది
నీ చలి నన్ను చంపేస్తోందంటావు
సప్త సముద్రాలకవతల నువ్వెలా వున్నావో గానీ
ఉండీ ఉడిగీ రోజుకోసారి మోగే సెల్ వైపు నా పడిగాపుల కాలమంతా
చెట్ల మీద స్వేచ్ఛగా కొమ్మల కబుర్లూనే రామచిలుకలు
బాధ్యతగా గూడు కట్టుకుంటూన్న పిచ్చుక జంటలు
వెంట పడ్తూ తరుముకుంటూన్న ఉడుత వరుసలు
వెల్సిపోతున్న చందమామని ఒడుపుగా పట్టుకుని
నిద్రపోతున్న నీ చెంపకి నా జ్ఞాపకంగా అతికిస్తాయిలే
నువ్వు పంపిన మంచుతడి ఉదయం హృదయాన్ని వెచ్చజేస్తోంది
రేపుదయానికల్లా
కిరణమై జాలువారి నీ గుండెలో ప్రవహిస్తుందిలే
————–
( నవ్య ఫిబ్రవరి 2007 ప్రచురణ)

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

4 Responses to ప్రవహించే సూర్యోదయం

 1. kalageeta అంటున్నారు:

  Ravi Sekhar garu, Bhumiki Avala umde edabatu varnanatitam- ade ii kvaita loni vyatha-
  mii comment ku dhanya vadalu-

 2. oddula ravisekhar అంటున్నారు:

  వెల్సిపోతున్న చందమామని ఒడుపుగా పట్టుకుని
  నిద్రపోతున్న నీ చెంపకి నా జ్ఞాపకంగా అతికిస్తాయిలే
  మంచి ప్రయోగం .చక్కటి కవిత్వం .ఎడబాటు లోని బాధ అనుభవిస్తేనే అర్థమవుతుంది.

 3. kalageeta అంటున్నారు:

  Thanks Bhaskar garu-

 4. the tree అంటున్నారు:

  chaalaa ardhram ga chepparandi feeling ni.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s