పారిజాత పచ్చబొట్టు

పాపాయి నవ్విందంటే

నక్షత్రాలు పారిజాతాలై ఇల్లంతా జలజలా కురుస్తాయి

మౌంట్ హేమిల్టన్ మంచు తొడిగిన సంబరం-

ముట్టుకుంటే కందిపోయే లేలేత బుగ్గల మీద

తళుక్కున మెరిసే చంద్ర వంక-

పాలు కారే పెదాల మీద ఇంద్రధనుస్సుని వెనక్కి వంచినట్లు

రంగు రంగుల పూదోట లో ఒక్కో పుష్పమే వరసగా విచ్చుకున్నట్లు

పాపాయి తెరలు తెరలుగా నవ్వుతుంది

ముఖాన చికాకు పెట్టే మెత్తని ముంగుర్లు రెండు అరచేతులా ముక్కుకేసి రుద్దుకుని

తేలకళ్లు ఎర్రబారే చూపుతో కట్టేసి

నవ్వే పెదాలతోనే పెదవి విరుపు రాగం లంకించుకుంటుంది

ఎత్తుకుంటే ముఖాన చరిచే చిన్ని వేళ్ల పై పదునైన ముక్కు గీరే గోర్లొకటి

కళ్ల లోకి సూటిగా చూసి

పెదాల్ని పైకి కిందికి కదిపి

కడుపులోని ఆకలిని గొంతులోకి తెచ్చుకుని

గుర్ర్ గుర్ర్ మంటూ ఏవేవో శబ్దాలు చేస్తుంది

మా…మా.. నా…నా… అంటూ కేరింతలు కొట్టి

కనబడ్డవన్నీ పీకి పాకం పెడ్తుంది

నోరే ప్రధాన సాధనంగా మసిలే పసిపాపాయి

జుమికి వదలని వస్తువే లేదు!!

ఉన్నట్టుండి ఏమైందో తెలీని కింక పెడ్తుంది

అసహాయ చూపులతో గుండెని పిండి గాభరా పెడ్తుంది

పాపాయి కంట నిలిచే ప్రతి కన్నీటి బొట్టూ

నా కళ్లలోకి చేరి బాధ పేగుల్లోంచి ప్రవహిస్తుంది

భగవంతుడా ! పాపాయి కష్టాలన్నీ తుడిచి  నాకివ్వు-

సంతోషంగా శిరసున మోస్తాను

బంగారు తల్లికి బాధేంటో చెప్పే భాష నివ్వు

అమ్మ మేరు పర్వతమని వెన్ను నిమిరి భరోసా నివ్వు

పాపాయి నవ్వొక్కటి చాలు

ప్రపంచమంతా పాదాక్రాంతం-

ప్రవహించే నదులన్నీ జలపాతాలై ఆకాశం నించి కురిసి సముద్రమైనట్టు

ఎండిన హృదయాలమీద

క్షణ క్షణం విరిగే జీవితాల మీద

పాపాయి పసినవ్వు ప్రాణాధార పచ్చబొట్టు-

……………….

(తానా జ్ఞాపిక-2011 ప్రచురణ)

ప్రకటనలు
This entry was posted in కవితలు. Bookmark the permalink.

2 Responses to పారిజాత పచ్చబొట్టు

  1. NS Murty అంటున్నారు:

    గీతగారూ,

    ఇంతకంటే ఎవరు పాపాయిని అందంగా అభివర్ణించగలరు.

    మనః పూర్వక అభినందనలు.

  2. oddula ravisekhar అంటున్నారు:

    ఎంత అందంగా వర్ణించారు పాపాయిని గురించి.పసిపిల్లలు దేవుడికి ప్రతిరూపాలంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s