గింజుకునే అక్షరం

                                                             

రాత్రి కిటికీ దగ్గర కూచున్నాను ఏదో రాయాలనిపించి

బయటెక్కడా కుక్కల అరుపుల్లేవు

మిణుగుర్ల జాడే లేదు

పిల్లల ఏడుపుల్లేవు

టీవీల గోల లేదు

అంతా నిశ్శబ్దం

పుప్పొడై రాలుతున్న నియాన్ లైట్ల కాంతి పుంజపు నిశ్శబ్దం

రాద్దామని కూచున్నానా కలం కదిలే ఆలోచనల్లేవు

పెన్ను లో ఇంకైపోయినట్లు మనస్సు తడారిపోయింది

కంట చుక్కజారని కరడు వర్తమానమైపోయింది

అయినా ఏదో తపన

రాయాలి రాయాలి

నేను బతికున్నానని నాకు తెలిసేందుకైనా రాయాలి

అందుకే నిశ్శబ్దాన్ని ఛేదించి

శబ్దాలు ఎగిసిపడే ప్రపంచంలోకి

కిటికీ నొదిలి

నిద్రిస్తూనే ప్రవేశించాను

సంవత్సరాల తరబడి  తిరుగుతూనే ఉన్నాను

నా చేతిలో తెల్ల కాగితం రెప రెప లాడినప్పుడల్లా

కాస్త జ్ఞాపకాల గంధం చల్లుకంటే గానీ కలం నడవదు

బతుక్కి కాస్త ఆనందం మిగలదు

రాత్రి అయిపోవచ్చింది

త్వరగా నిద్రించాలి

కాదు కాదు త్వరగా వెనక్కు రావాలి

అయ్యో ఖర్మ!

నిద్రా

మెలకువా

రాతా?

కోతా!

కళ్లు విప్పమని బలవంతంగా భుజాలు పట్టి కుదుపుతున్న కవిత్వం

ముసుగు పెట్టి తన్నే కాస్త మురిపాల రాత్రిని వదల్లేనితనం

గింజుకున్నా

రాని అక్షరం

లేని మోక్షం

క్షమించు మిత్రమా! నీకెప్పుడో ఏటొడ్డున చేసిన ప్రమాణం

ఈ రాత్రికి ఇక ఆఖరు

——–

Published in Koumudi- Oct,2012

http://www.koumudi.net/Monthly/2012/october/oct_2012_kavitha_koumudi.pdf

 

ప్రకటనలు
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to గింజుకునే అక్షరం

  1. the tree అంటున్నారు:

    బాగుందండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s