గడియారం vs గుండె

నన్ను చూసి గడియారం వికటాట్టహాసం చేసింది

అంతా ఎటో వెళ్లిన అపరాహ్న వేళ ఎర్రని డిజిటల్ కళ్లేసుకుని ఉరుమురిమి చూసింది

నా చుట్టూ జ్ఞాపకాల సైకత శిల్పం పొడై రాలుతున్న నిశ్శబ్దం

టకా టక్ -టకా టక్ – బతికుంది సుమా  గడియారం తో బాటూ గుండె

సమ ఉజ్జీగా పరుగెడుతోంది

ఎక్కడిదో ఓ ఉత్తరం

పుస్తకం పొట్టలో జీర్ణం కానట్లుంది

వీపు తట్టగానే బైట పడింది

గడియారాన్నీ  గుండెనీ గిర్రున వెనక్కి తిప్పింది

గదంతా గుండ్రంగా తిరిగి మళ్లీ అక్కడే ఆగింది

గడియారం కవాతు-

టకా టక్ -టకా టక్ –

నిమిషాలు యౌవనం మీంచి చేజారి పోతున్న వేగం

గడియారం ముందుకీ   గుండె వెనక్కి-

జ్ణాపకాల్లో ముక్కు ముంచి గతాన్ని తాగి

మత్తుగా నిద్రపోతోంది-  కవాతు- కవాతు-

వెనక్కెనక్కి- సమ ఉజ్జీగా పరుగెడుతోంది

…………………

కౌముది, నవంబరు- 2012 ప్రచురణ

(http://www.koumudi.net/Monthly/2012/november/nov_2012_kavitha_koumudi.pdf)

ప్రకటనలు
This entry was posted in కవితలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s