కొత్తిల్లు

కళ్లు తెరిచే సరికి

ఉదయపు మెరిసే కాంతి రేఖల స్పర్శ

కొత్తింట్లో ఆహ్లాదపు చిరు దరహాసం

పడగ్గది లో చలి నెగడు ఇంకా నిద్ర పోతూంది పాపం

ఏసీ తో పోటీ పడలేని అటక మీది దూది పొరలు పిల్లిపిల్లల్లా ముడుచుకునున్నాయి

బాల్కనీ అద్దాల తలుపు  ఇప్పుడిప్పుడే

నీరెండకు ఒళ్లు దులుపుకుంటూంది

బయట  చలి కుక్క రాత్రి నుంచీ ఇంకా ఎముకలు కొరుకుతూనే ఉంది

గుండ్రటి రంగు కళ్లేసుకుని బాల్కనీ మీదకి తొంగి చూస్తున్న నారింజ చెట్టు

పసి పాప ఇల్లంతా  పాకినట్లు

దడికి అన్నివెపులా అల్లుకున్న బోగన్ విల్లా

ఇంటి రాజకుమారిని కాను నేనిప్పుడు -రాణీని

వరండా కిటికీ తెరలు గౌరవంగా పక్కకు తప్పుకున్నాయి

రెడ్ వుడ్ చెట్లు వరుసలో కవాతు జవాన్లలా నిలబడ్డాయి

పిల్లల గదుల్లో మధ్యాహ్నం వరకూ

ఆదివారం ముసుగుతన్నబోతున్నట్లు  మూసి ఉన్న తలుపులు

మెట్ల మీద అడుగుకో ప్రతిధ్వని

ఎప్పటిదో అట్టడుగున హర్షధ్వానపు  జ్ఞాపకంలా

అత్యాధునిక వంట గది

అందమైన మంత్రగత్తెలా

అమ్మ పాత్ర లోకి పరకాయ ప్రవేశం ఎప్పుడని ప్రశ్నిస్తూ

నిశ్శబ్దపు హాలు ధ్యానిస్తున్నట్టు అర్థ నిమీలిత నేత్రాలతో

గది తర్వాత గది

మెట్టు తర్వాత మెట్టు

ఆకాశపు నిచ్చెన మీద

భూగోళానికివతల అద్భుతమై మొలిచిన  ఒక  సొంతిల్లు

గాల్లో అప్పుడే విచ్చుకున్న తూనీగ రెక్కైన మనసు

కిరణాల ఊడలు పట్టుకుని గోడల్ని తడిమి

నీటి తొట్టె లో నునువెచ్చగా మునిగి తేలి

కిటికీ తెరల కమ్మని గాలి కబుర్లు విని

ఇల్లంతా ఆగిన చోట   మళ్లీ కాలూన్చ  కుండా గిరికీలు కొడుతూంది

నేలకి అడుగు ఎత్తున పాదాలు ఆన్చీ ఆన్చ కుండా చెవుల పిల్ల్లై దుముకుతూంది

నక్షత్రాల తోరణాలు దాటి

నెలవంక దీపాలు చేసి

ఆకాశం, సముద్రం కౌగిలింతల  దోబూచులాడి

మెట్లపై నుంచి ఉడుత లా తొంగి చూసీ

గమ్మత్తుగా చలిచీమై పాకీ

మనసు ఇల్లంతా కలయదిరుగుతూ

రోజూ అనుకుంటుంది

గరాజు తలుపు వెనక తలకు భారమై మూలుగుతున్న సామాన్లని ఇవేళ్టికి అట్టపెట్టెలోనే ఉండనిద్దాం…

………………….

Kotthillu_Geeta 2013

(Andhra jyothy “Vividha” Jan28,2013 )

ప్రకటనలు
This entry was posted in కవితలు. Bookmark the permalink.

8 Responses to కొత్తిల్లు

 1. kki Raghavendra Rao. అంటున్నారు:

  మనసు ఇల్లంతా కలయదిరుగుతూ

  రోజూ అనుకుంటుంది

  గరాజు తలుపు వెనక తలకు భారమై మూలుగుతున్న సామాన్లని ఇవేళ్టికి అట్టపెట్టెలోనే ఉండనిద్దాం……సమయాభావ వేదనలు …..సరళ రీతిన మీ ఈ గీతం అద్భుతం …గీత జి .

 2. buchi reddy అంటున్నారు:

  bagundhi geetha garu
  velutho call chesthaara dayatho
  buchi reddy
  9495108590 cell

 3. kalageeta అంటున్నారు:

  Thanks Murthy garu and Jeevan garu-

 4. జ్యోతిర్మయి అంటున్నారు:

  కవిత చాలా చాలా బావుంది గీతగారు. అభినందనలు.

 5. padmarpita అంటున్నారు:

  సూపర్ గా రాసారు….అభినందనలు.

 6. sujata అంటున్నారు:

  How sweet ! Cogratulations.

 7. nava jeevan అంటున్నారు:

  మీ నూతన గృహాన్ని చాలా సుందరంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
  (నక్షత్రాల తోరణాలు దాటి ,నెలవంక దీపాలు చేసి, ఆకాశం, సముద్రం కౌగిలింతల దోబూచులాడి)

  పదాల అల్లిక తో చేసిన గారడి చాలా బాగుంది

 8. NS Murty అంటున్నారు:

  బయట చలి కుక్క రాత్రి నుంచీ ఇంకా ఎముకలు కొరుకుతూనే ఉంది… excellent
  And hearty congratulations too for possessing a new home… a home away from home.
  with best regards

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s