అమెరికాలో కె.గీత “శతాబ్ది వెన్నెల” ఆవిష్కరణ

SatabdiVennela_USA

(Sri Bulusu Narayana, K.Geeta, Smt Aparna Gunupudi, Sri Akkiraju Ramapathi Rao, Sri Kiran Prabha)

కాలిఫోర్నియా బే ఏరియాలో ప్రతి రెండవ ఆదివారం జరుగుతున్న వీక్షణం సాహితీ సమావేశాల్లో ఫిబ్రవరి 10, 2013 న కె.గీత మూడవ కవితా సంపుటి “శతాబ్ది వెన్నెల” ఆవిష్కరణ  జరిగింది.   సభకు శ్రీ బులుసు నారాయణ అధ్యక్షత వహించగా,  ఆవిష్కర్త శ్రీమతి గునుపూడి అపర్ణ మాట్లాడుతూ శత జయంతి జరుపుకుంటున్న తమ మామ గారి ఆశీర్వాదం కూడా శతాబ్ది వెన్నెల కు లభించిందన్నారు. మొదటి ప్రతి ని అందుకున్న ఆనాటి సభకు అతిధిగా విచ్చేసిన అక్కిరాజు రమాకాంత రావు గారు  ఆర్ద్రత, భావుకత, పరిశీలన, ప్రతిస్పందన  గీత కవిత్వం అని చమత్కరించారు. శ్రీ కిరణ్ ప్రభ పుస్తక పరిచయం చేస్తూ అమెరికాలో వస్తున్న కవిత్వం చదవమని ఎవరికైనా చెప్పేటప్పుడు ఇక మీద గీత కవిత్వం చదవమని చెప్తానన్నారు. ఈ సంపుటి లోని కొన్ని కవితల్ని ఉదహరిస్తూ ఇతరులు సృశించని అంశాలెన్నో గీత కవిత్వీకరించిందని అన్నారు. ఉదాహరణకి కారు అమ్మిన బాధ ని ఆవిష్కరించిన కవిత “నాలుగు కాళ్ల గది” ని చదివి వినిపించారు. గీత తను అమ్మగా రాసిన కవితల్ని, తన అమ్మ ను గురించి రాసిన కవితల్ని ఉదహరించారు. ఆ కవితల్లోని సున్నిత ఆర్ద్రతను కొనియాడారు. ఈ సమావేశానికి స్థానిక రచయితలు, కవులు అయిన వేమూరి వేంకటేశ్వర్రావు, తాటిపామల మృత్యుంజయుడు, రావు తల్లాప్రగడ, ఆనంద్ బండి, కె.శారద, చుక్కా శ్రీనివాస్  మొ.న వారు హాజరయ్యారు.

– కె.గీత

Publshed in March , 2013 by VIHANGA

– (http://vihanga.com/?p=7363)

ప్రకటనలు
This entry was posted in సాహిత్య వ్యాసాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s