అమ్మ రాదు

రోదన కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఎంత బావుణ్ణు

అమ్మ పాపాయికి మిగిలేది

పాపాయి అమ్మకి మిగిలేది

నీట మునిగో

గరళం మింగో

కట్టెల పొగయ్యో

పెరట్లో రహస్యపు కన్నీళ్ల భూస్థాపితమయ్యో

ఎలాగో అల్లా అమ్మ పాపాయికి మిగిలేది

పాపాయి కళ్లల్లో బయటి నల్ల గీతలు

లోపలి ఎర్ర గీతలు అమ్మ చూడ గలదా!

పసి దానికి పాలివ్వకుండా జాకెట్టు ముడేసుకు వెను తిరగ గలదా!

అయినా అమ్మ రాలేదు

రాత్రిళ్లు పగళ్లు రోదించినా అమ్మ రాలేదు-

భూమిపై ఏదో మూల పగటి నక్షత్రమై మాయమైన  అమ్మ తిరిగి రాలేదు

నాన్నొక అమ్మని, అమ్మొక నాన్నని తెచ్చుకునే

తప్పని సరి చట్రంలో నలిగిన నలుసులకి

కన్నీళ్లున్నాయా ఇంకా!!

అమ్మ రాలేదు-

అమ్మ రాదు-

అమ్మ ఎప్పటికీ వెనక్కి రాదు-

కాదు కాదు-

నాన్న అమ్మని రానివ్వడు-

గొప్ప పురుష పుంగవుడు కదా!

తొలి రాత్రి నించీ రసిక కథల్ని మీసం మెలేస్తూ చెప్పుకున్న మొగాడు

పెళ్లం పరాయి వాడితో పగలబడి నవ్వితే భూమిలో నిలువునా కూరుకు చచ్చే మొగాడు

అమ్మ ఎందుకు రాలేదు?

నాన్న రానిస్తేనా!!

నాన్న బతకనిస్తేనా!

నాన్న పొరుగింటి పురుగై

పొరుగిల్లు పుచ్చిన సమాజమై

అందరూ తరిమి తరిమి కొట్టిన అమ్మ

పాపాయి కోసం ఎక్కడో ఎన్ని రాత్రిళ్లు రోదించిందో!

వెనక్కు తిరిగి రాలేని వ్యథావేదనని ఎంత కాలం నించి మోస్తూందో!

పాపా! నాన్నని నిలదియ్యి-

అమ్మని తరిమి కొట్టిన నాన్నని నిలదియ్యి-

మొగాళ్లని నిలదియ్యి-

కన్నీళ్లని మాత్రమే మిగిలుస్తున్న మొగుళ్లని నిలదియ్యి-

– ( దమయంతి కూతురు చదివేక-)

-కె.గీత

Published in October , 2012 Vihanga

(http://vihanga.com/?p=5629)

 

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s