చరిత్ర చలనం

కిటికీ లోంచి పర్వతం కనిపిస్తోంది

అదే చూపు-

మౌన సాక్ష్యం-

నడుస్తున్న చోటల్లా రక్తపు ముద్రలు

పాదాల కింద గుచ్చుకుంటున్న చరిత్ర ముళ్లు

ఏ సంస్కృతిని చూస్తున్నాను నేను?

నిద్దట్లోనూ కత్తుల కరాళ నృత్యం

మట్టినొరిగిన రుధిర వీరులు లేచి పోరాడే దృశ్యం

అయిదొందల ఏళ్ల తర్వాత

ఏ నేల మీద కాలూనడానికొచ్చాను నేను?

ఇళ్లన్నీ తగలబడుతున్నాయి

స్త్రీలు- పిల్లలు- ఆర్తనాదాలు

అదిగో మతం ఆగకుండా మోగుతోంది

ఇదిగో బంగారం ఇక్కడ కాల్వల్లో ప్రతిఫలిస్తోంది

జంతు చర్మాలకు తుపాకులు

మనిషి చర్మాలతో తివాచీలు

వ్యాపారం- దుర్మార్గం- ఆక్రమణం-

ఏమీ తెలీని ఆది మానవుల్లారా-

ఆధునిక గడ్ద మీద అసలు మానవుల్లారా-

మీ తలపై రంగుల పక్షి ఈకలు

మెడలో వేలాడే వరుస శకునాలు

సుదూరం నించొచ్చిన ఆపదని పసిగట్టలేక పోయాయా?

నిరంతరం మంచు మోసే కూలీ పర్వతాలు

ఋతువుల చెప్పిన మాట వినే బానిస చెట్లు

ఏమీ ఎరగనట్లు దిక్కులు చూసే ఆకాశం

ఏం చెబుతాయి?

అబద్ధపు చ  రిత్రను ఏ ప్రమాణాలతో తిరగ రాస్తాయి?

మొదటి ప్రపంచమా!

నీ గొంతులో దిగబడ్ద ఆక్రందనలు పెనుగాలులై

మహా సముద్రాలు చుట్టి వెను తిరిగాయి

నీ ఒంటి మీద రోమాలై నిలబడ్డ ఎస్టేట్లన్నీ

చరిత్ర ముందు సిగ్గు లేక నిల్చున్నాయి-

– డా.కె.గీత

Publshed n January , 2013 by VIHANGA

( http://vihanga.com/?p=6581)

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s