సాయం కలలు

నడిచిన క్షణాల గొంతుల్తో దు:ఖానందాల మిశ్రాణువులు
ఒదిగిన శరీరాల్లోపల విహంగాల్లా రెక్కలార్చే మనసులు
కన్రెప్పల చివర్నించి పెదాల్ని తొంగి చూసే కాంక్షాంతరంగాలు
ఒక కోయిల హృదయం కొమ్మ చివర ఊగిసలాడుతూ ప్రేమని మీటుతూంది
ఓ గమ్మత్తు ఉడుత ప్రేమికుల తమకాన్ని తడిమి తుర్రుమంటుంది
ఆకుపచ్చని చదువు చెట్ల ఆకాశం పూల కొంగుల్ని అక్కడక్కడా ఆరేసింది
లేలేత సంధ్య కిరణాల పాటల
జంట ఆడే గాజుల మువ్వల గలగల
భాషేదైనా వెన్నెల కురిసే ముఖం ఒక్కటే
ప్రేమ నిండిన హృదయాల శరీరమొక్కటే
అశరీరులై హత్తుకునే చుంబనాల సెకన్లలో
యుగాల పలకరింపు-
మౌనాలు కురిసే మల్లెల సౌరభ కాంతిలో
మోహాల మోహరింపు-
ఎటు కదిలినా విరహాల వాన
ఆలోచన్ల నిండా విరితూపుల వెన్నెల సోన
సాయంత్రాలు బహుమతిగా ఇచ్చే రాత్రుళ్లే లేకపోతే
మత్తైన మాధుర్య స్వరం వినబడుతుందా?!
సౌందర్యం వికసించే తెల్లారగట్ల మెలకువ లేకపోతే
గుండె కొట్టుకునే సవ్వడి తెలుస్తుందా!?
ప్రియతమా! ఈ క్షణాల్ని జారనివ్వకు
ఆగిపోయే జీవితాన్ని ఎప్పుడూ కలల్తోనే నింపకు

-కె.గీత

…………..

Published in n March , 2013 by VIHANGA

(http://vihanga.com/?p=7437)

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s