నేనెవ్వరిని?

నేనెవ్వరిని?

రాష్ట్రంలా వర్తమానం ముక్కలైంది

అటెటో మబ్బు పట్టిన ఆకాశమల్లె

ఎటెళ్లాలో తెలీని

ఎటూ దారి లేని ఒంటరి భయం

గుండె చిక్కబట్టుకుని

మోకాళ్లలో మెదడు దాచుకుని

నలభై ఏడులో దేశ విభజన రేఖ

కిరుప్రక్కలా ఛిద్రమైన బతుకు ముక్కల

దు:ఖ పునరావృతాలు

రక్త చారికలు

ఇక్కడా మొలుచుకురాబోతున్నాయా?!

లోపల్లోపల పెదాల ప్రార్థనలు

ఎక్కడ నా భవితవ్యం?

ఏది భయం లేని క్షణం?

ఒక వైపు ఇరవైయ్యేళ్లు పుట్టిన ప్రాంతం

ఒక వైపు ఇరవైయ్యేళ్లు బతుకు పుట్టిన ప్రాంతం

ఏది నాది?

ఎటు నాది?

కత్తి అంచునో

నూతి గట్టునో

తుపాకీ గొట్టానో

కొన ఊపిరితో వేళ్లాడే

నా ప్రాణం

ఇక దినం దినం

క్షణాల నూగు

భగ భగా గుచ్చుకునే వ్రణం

సలిపే సెగల కణాల కింద నా బతుకు

బలైన ఈ తరపు తొలి చితుకు

నా భాష ఒక ముక్కదైతే

నా గుండె మరో ముక్కది

నా బాల్యం చివర

నా బతుకు చివర

చివరి శ్వాసై వేళ్లాడుతున్న

నలభై తర్వాతి

నా భవిష్యత్తు

ఎక్కడున్నా

నా తరపు చారిత్రక గతి

ఒక జీవిత కాలపు వెలితి

ఉన్న రాష్ట్రానికి  నా ఉనికి చెందదు

పుట్టిన రాష్ట్రంలో వీసమెత్తు మిగల్లేదు

ఎటో పోతున్న మబ్బు ఆకాశమల్లే

ఎటు చూసినా దిక్కు తోచని దిగంతమల్లే

దు:ఖపు పొరలు

ఎగబ్రాకుతున్న విషవర్తమానపు సెగలు

ఎటూ చెందని

ఉనికి లేని

పాదం నిలబడనివ్వని

పగల జారుడు బల్ల మీద

పొర్లే ద్రావకపు బతుకు

ఇవేళ్టి  రోజు

ఎటెళ్లాలి?

ఎటెళ్లాలి?!

ఎక్కడ నా స్వస్థలం?

నేనెవరిని?

నేనెవ్వరిని?!

……………….

Published in Andhra Jyothi, Vividha on 05-Aug-2013

ప్రకటనలు
This entry was posted in కవితలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s