అనగనగా అమెరికా-15 (పోలీసు కోటా)

– డా|| కె.గీత
“పొద్దుట్నించీ మూడ్ బాలేదండీ. ఇవాళ ఉదయం స్కూలుకి పిల్లని దించడానికి వస్తున్నానా! స్టాపు సైను దగ్గిర బ్రేకు కొట్టడం మర్చిపోయా. ఎక్కడ్నించి తగలడ్డాడో పోలీసు, ఫటామని ఊడిపడి టిక్కెట్టు చేతిలో పెట్టిపోయాడు. అప్పట్నించీ తలపోటు పట్టుకుంది. ఎంత ఫైను వేస్తాడో ఏమో!” అంది స్కూలు దగ్గర కలిసినావిడ.”అయ్యో మీకూనా! నాకూ టిక్కెట్టిచ్చాడండీ పోలీసు నిన్న. స్కూలు దగ్గర్లో 25 మైళ్ల వేగం కంటే ఎక్కువ నడుపుతున్నానంటాడు. పిల్లాణ్ణి స్కూలు దించే హడావిడి. వేగం ఎంతుందో ఎవడు చూసొస్తాడండీ. అంతే కాదు జెన్నీ వాళ్లమ్మకూ ఈ వారంలో టిక్కెట్టు పడిందంట. తెలుసా? “అంది మరొకావిడ.అది మొదలు స్కూలు దగ్గిర పోలీసు టిక్కెట్ల చర్చలు తరచూ ఏదో ఒక గుంపులో వస్తూనే ఉన్నాయి. ఇదేదో పరిశోధించదగ్గ విషయంగా కనబడినట్లుంది. ఒకావిడ ఏకంగా ఎవరు ఇలాంటి విషయం చెప్పినా సెల్ ఫోనులో నోట్ చేసుకోవడం మొదలుపెట్టింది.మొత్తానికి గత మూడు నెలలుగా స్కూలు బయట చేరిన వాళ్లల్లో కనీసం సగం మందికి ప్రతీ నెలా చివరి వారంలో ఏదో విధంగా పోలీసు టిక్కెట్లొచ్చాయని కనిపెట్టి చెప్పింది మా అందరికీ.ఇదింకా విచిత్రంగా తయారైంది మాకు. “దిక్కుమాలిన పోలీసులకి మనమే దొరికామటండీ” అనొకరూ..”గన్ను పెట్టి పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చేసిన వాడినేమి చెయ్యలేరు గానీ, బుద్ధిగా రూల్స్ పాటించి డ్రైవ్ చేసే మనలాంటి వాళ్లం చిన్న పొరబాటు చేస్తే ఏదో మునిగిపోయినట్లు టిక్కెట్టిచ్చేస్తారు.”అనొకరూ…”అయినా ఇక పోలీసోళ్లకి వేరే పనేమీ లేదా? అయినా టిక్కెట్టివ్వడానికి దొంగ వెంట పడ్డట్టు వాడు మోగించే హారన్ ఉంది చూసారూ, అది మోగేసరికి వినడానికి ఒళ్లంతా కంపరమెత్తుతూంది నాకు టికెట్టు వచ్చిన దగ్గర్నించీ” అనొకావిడా వాపోయారు.మొత్తానికి మా పరిశోధకురాలు ఇతర స్కూళ్ల వాళ్లని కూడా సర్వే చేయడం మొదలుపెట్టింది.మరో నెల తర్వాత “ఏవండోయ్, కనిపెట్టేను” అంది ఆవిడ హడావిడిగా మా వైపు వస్తూ.చేతిలో సెల్ ఫోనుతో, దీక్షగా ఏదో పని మీదున్నట్టు వాలకం  చూడగానే గుర్తు పట్టాం. “ఆవిడ పోలీసు టిక్కెట్లు ఎవరెవరికి ఎందుకొచ్చాయో పరిశోధించే ఆవిడని.” ఇంతలో ఆవిడ ఒగురుస్తూ అంది. “చూసారా! నేను తయారు చేసిన ఈ పోలీసు టిక్కెట్ల పట్టిక. ఇందులో ఎవరెవరికి ఏయే రోజుల్లో, ఏ కారణం చేత, స్కూళ్లకి దరిదాపుల్లో ఏ సందుల్లో  టిక్కెట్లు వచ్చాయో అన్ని వివరాలూ ఉన్నాయి” అని చూపించింది.అందులో మేం నేర్చుకోవలసింది ఏముందా అని మేం మొహమొహాలు చూసుకుంటూండగా..”ఏవీ లేదండీ- ఇక్కడి పోలీసోళ్లకి కొన్ని ప్రత్యేక కోటాదినాలున్నాయి. వీళ్లకి నెలకి ఇన్ని కేసులు బుక్ చెయ్యాలన్న కోటా నిండలేదనుకోండి. ఇలా హడావిడిలో తప్పు చేసే అవకాశం ఉన్న స్కూళ్ల వంటి సందుల్లో నెలాఖరులో కాపలా వేసి మరీ బుక్ చేస్తారన్నమాట. పోలీసోళ్లకి కావలిసింది వాళ్ల కోటా నిండడం. ఇక్కడ వీళ్లిలా కోటా నింపకపోతే అసలు జీతానికే ఎసరు వస్తుందన్నమాట. అందుకే మీరెంత ప్రాధేయపడ్డా, ఏ పోలీసూ టిక్కెట్టు వెనక్కి తీసుకున్న పాపాన పోడు. అందుకే ఇక మీదట నెలాఖరులో జాగ్రత్తగా ఉండండి. స్కూలు దగ్గిర మరింత.” అని తేల్చింది.అప్పటికే మూడేసి, నాలుగేసి వందలు ఫైన్లుగా కట్టిన మేమంతా ఈ రీసెర్చి ముందెందుకు మేం చెయ్యలేదా అని బాధపడ్డాం.కష్టపడి రీసెర్చి చేసి సమాచారం తెచ్చి మమ్మల్ని జాగరూకుల్ని చేసినావిడకి అందరం కలిసి “ట్రీట్” ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

-http://www.andhraprabha.com/columns/geetha-madhavi-article15-about-policing-in-us/8340.html

 First Published: 20 Dec 2013

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

2 Responses to అనగనగా అమెరికా-15 (పోలీసు కోటా)

  1. kalageeta అంటున్నారు:

    కొంచెం తేడా- ఇక్కడ డబ్బులు డైరక్టుగా మనల్ని అడగరు.

  2. hari.S.babu అంటున్నారు:

    అక్కడ కూడా ఇక్కడి మాదిరిగానేనా?పోలీసులు యెక్కడయినా ఇంతేనా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s