అనగనగా అమెరికా-16 (తెలుగు డిపెండెంటు సంఘం)

– డా|| కె.గీత
“అమెరికాలో ఉద్యోగం సంపాదించడం ఎలా?!””ఇదేదో ఇండియాలో ఉన్న వాళ్లు అడిగిన ప్రశ్న అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.” అన్నాడు తె.డి.సం ప్రెసిడెంటు ఎదురుగా ఉన్న సభ్యులతో.తె.డి.సం అంటే “తెలుగు డిపెండెంటు సంఘం”.ఇదేమి సంఘం? “పడిసం” లాగా. అన్నవారూ లేకపోలేదు. దానికి “సరిగ్గా పోల్చారండీ. అవును మరి అమెరికాలో డిపెండెంటు బతుకు పడిసం లాంటిదే. ఎప్పటికీ చీదుతూ ఉండాల్సిందే గానీ, ఉపశమనం లేదు.” అన్నాడొక సభ్యుడు.”ఇంతకీ తె.డి.సం లో మీరు సభ్యులు కావడానికి అర్హతలేమిటంటే మిమ్మల్ని పోషించే పెళ్లామో, మొగుడో ఉంటారు కదా, వాళ్లతో మీరిక్కడికి డిపెండేంటు వీసా మీద వచ్చి ఉండాలి.వచ్చిన నాలుగు నెలల్లో ఇక్కడీ వీసాతో ఎటువంటి ఉద్యోగానికి అర్హులు కారని తెల్సిపోతుంది కదా. అప్పుడు తె.డి.సానికి  అర్హత మీకు వచ్చేసినట్టే.”సెలవిచ్చారు సంఘం ప్రెసిడెంటు గారు కొత్తగా చేరదల్చుకున్న వాళ్లకి.ఇందులో ఏమి చేస్తారయ్యా అంటే. ముందుగా మీ గోడు వెళ్లబోసుకుంటారు. అలా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ల గోడు విని అంతకంటే తమకే తక్కువ కష్టం ఉందని స్థిమిత పడ్డాక,కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుకోవడంతో మొదటి సమావేశం అయిపోతుంది.ఇక తర్వాతి సమావేశంలో ఎవరెవరు వాళ్ల కాలాన్ని ఎలా వెళ్లబుచ్చుతున్నారో చెప్పడమన్న మాట. అందులో “సంతోషంగా కాలాన్ని వెళ్లబుచ్చడం” అనేది ముఖ్యాంశం. అనేది దాదాపుగా సమావేశ సారంశం.ఇక మూడో సమావేశంలో సమయం ఎంత ఉపయోగకరంగా గడుపుతున్నామనేది ముఖ్యాంశం. అంటే “ఇంటిపని చేసిందే చేస్తామనో”, “షాపింగులకి గట్రా వెళ్లి కాలక్షేపం చేస్తామనో”, “ఆన్ లైన్‌లో సినిమాలు చూస్తూ గడుపుతామనో”, “ఏ ఫేసుబుక్కులోనో, ఛాటింగ్‌లోనో సమయం గడుపుతామనో” కాకుండా మీకు ఉపయోగపడేదో, సమాజానికి ఉపయోగపడేదో చెయ్యడమన్నమాట.ఇలా వరసగా సమావేశ చర్చల్లో ఇండియా పాలిటిక్సు నించి అమెరికా ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పిటిషన్ల వరకు కూడా అప్పుడప్పుడూ చర్చకు పొరబాటున వస్తూంటాయిలెండి.”తె.డి.సం లో సభ్యత్వం ఉచితం. వాలంటీరుగా తలొక పనీ అందుకుని చెయ్యొచ్చు. ఇలాంటివి యమా హుషారుగా చెయ్యగలిగిన వాళ్లు కూడా ఇక్కడ ఉద్యోగం విషయం అనేమాట వచ్చే సరికి బాధ పడిపోతారు. ఇలా బాధపడడం మొదట మానెయ్యాలి” ప్రెసిడెంటు ఉపన్యాసం కొనసాగుతూంది.ఆ సమావేశానికి ఒక డిపెండెంటు సభ్యురాలితో బాటూ వచ్చిన డిపెండెంటు అమ్మగారు  “అక్కడ జనాభా ఎక్కువయ్యి ఉద్యోగాల్లేవు, ఇక్కడ వీసా తాళ్లెట్టి బంధించేసినందువల్ల  ఉద్యోగాల్లేవు.”ఇండియా అట్టా ఏడిస్తే, అమెరికా ఇట్టా ఏడిసిందన్నమాట” అని నిట్టూర్చింది.

 First Published: 27 Dec 2013

http://www.andhraprabha.com/columns/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B0%82/8855.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s