అనగనగా అమెరికా-7(మంచి డెంటిస్టు…)

– డా|| కె.గీత
పార్కులో పరిచయమైన సుబ్రహ్మణ్యం గారికి “మంచి” డెంటిస్టుతో అవసరం పడింది.
ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్‌లు వగైరాలతో సరైన డాక్టరుని పట్టుకోలేని బాధితుల్లో వీరూ ఒకరన్న మాట, అనుకున్నాను. కనబడిన అందరినీ ఆయన వాళ్ల డెంటిస్టు వివరాలు అడగడం విన్నాను.
నాలుగేళ్ల బట్టి మా డౌన్ టౌన్‌లోని డెంటిస్టు దగ్గరికి వెళ్తున్నాం మేం.
ఈ దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్‌లో భాగం కాకుండా, డెంటల్ ఇన్సూరెన్సు ఒక విడి నెట్‌వర్క్‌గా పని చేస్తుంది. మనం సంవత్సరం మొదట్లో తీసుకున్న ఇన్సూరెన్సుల వాళ్ళ లిస్టులో కనబడ్డ మొదటి డెంటల్ క్లినిక్కు వాళ్లకి ఫోను చేసి అపాయింట్‌మెంటు తీసుకుని వెళ్లి, ఇక అక్కడే నాలుగేళ్ల బట్టీ కొనసాగుతున్నాము. అదే నేను చెప్పేసరికి నోరు వెళ్లబెట్టాడాయన. “అదేమిటండీ , నాలుగేళ్ళ బట్టి ఒక డెంటిస్టు దగ్గరికి వెళ్ళడమేంటీ” అన్నాడు పైగా.
“అదేమైనా తప్పా” అన్నాన్నేను.
“తప్పు కాదనుకోండి, 4 సం||రాలుగా ఒక చోటికే వెళ్తున్న వాళ్లని మిమ్మల్నే చూసాను” అన్నాడాయన.
ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది. “అలా అంటున్నారేమిటీ?” అన్నాను.
“మీ డెంటిస్టు దగ్గరికి వెళితే మీకు వచ్చే లాభం ఏవిటి? అన్నాడు.”
“లాభం…అని ఒక్కసారి ఆలోచించి, లాభం ఏమిటంటే మన పళ్లు పాడైపోకుండా ఆర్నెల్లకోసారి ఉచితంగా డెంటల్ క్లినింగ్ చేస్తారు.”
“అదందరూ చేస్తారండీ, సర్వీసు చాలా గొప్పగా ఉంటుందా?”
“సర్వీసు ఓ మాదిరిగా ఫర్వాలేదు. అయినా ఇక ఇంత కంటే లాభం ఏవుంటుందండీ ఎవరి దగ్గరికెళ్లినా” అన్నాను.
“అదేనండీ మన అజ్ఞానం. అలా అనుకునే చాన్నాళ్లు నేను పట్టించుకోలేదు. కానీ నాకు గత సంవత్సరం జ్ఞానోదయమైంది. దాన్ని బట్టి  మనం మనకు లాభం ఉండే ప్రొవైడర్‌ను వెతుక్కోవాలి.”
నా ముఖంలోకి చూసి, నాకర్థం కాలేదని ఇలా వివరించాడాయన.
ఉదాహరణకి కిందటేడాది మా డెంటిస్టు మనిషికొక ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఇచ్చాడు. అదిగాక పోతే లేదా గిఫ్ట్ కార్డు లేదా సినిమా టిక్కెట్లు తీసుకోవచ్చు” అన్నాడు.
“ఇలాంటి అడ్వర్టైజ్‌మెంటు నాకెక్కడా కనబడలేదండీ” అన్నాను.
అదేనండీ విచిత్రం ఇలాంటివి సాధారణంగా ఇండియన్, చైనీస్  స్టోర్ల లోను లేదా అక్కడక్కడా అదృష్టం కొలదీ మాత్రమే కనిపిస్తాయి.
మరి ఇన్సూరెన్సు కో పేగా కట్టే ఫీజు బాగా వడ్డిస్తారంటారా? అన్నాను. మా డెంటిస్టు ఇప్పటివరకు ఎటువంటి గిఫ్టు ఇచ్చిన పాపాన పోలేదు సరికదా, పళ్లకి రిపేరులంటూ ప్రతి సారీ ఒక్కో పన్నుకి 30 డాలర్లు పుచ్చుకున్నాడు. ఇక పంటికి గార్డు అంటూ 600కి కోట్ ఇచ్చాడు.
అయ్యో ఇన్నాళ్ల నించీ ఇలాంటి రీసెర్చ్ చెయ్యలేదని మనస్సులో బాధపడ్తూ “మరి అలాంటి మంచి డెంటిస్టుల దగ్గరి నించీ మారిపోవడమెందుకండీ” అన్నాను.
అదేనండీ కిటుకు. ఈ ఆఫర్లు కేవలం మొదటిసారి వెళ్లిన వాళ్లకి మాత్రమే ఇస్తాడు ఏ డెంటిస్టయినా.
“మరి సర్వీసులు వగైరా అన్నీ మీకు బయట మరే ఇతర డెంటిస్టుల దగ్గర కన్నా తీసిపోకుండానే ఉంటాయండీ. కాకపోతే ..” అని గొంతు తగ్గించి, “మీరు నాలుగు పళ్లకి వైద్యం చేయించుకోవలిసి ఉంటుంది” అన్నాడు.
“అమ్మో పంటికి 30 డాలర్లండీ” అన్నాను.
నా వైపు గొప్ప జాలిగా చూసాడు.
“అదేంటి పళ్లు అన్నీ ఉచితమని మొదటే మాట్లాడుకుంటాం కదా!” అని, “మనం ఎప్పుడూ బిల్లులో 20% మాత్రమే కడతాం, కానీ ఇన్సూరెన్సు మిగతా 80% కడుతుంది. మీకు తెలుసు కదా! పోనీండి అతనెన్ని పళ్లకి వైద్యం చేస్తే ఎందుకు ? మనక్కావలిసింది మనకు బేండు పడకుండా ఉండడం, పైగా కాస్తో కూస్తో లాభమూ ” అన్నాడు.
“అయ్యో, ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ ఆలోచించలేదండీ.”అన్నాను.
“ఇంతవరకు నాకు వచ్చిన సమాచారంలో ఒక డెంటిస్టు కుటుంబంలో నలుగురికి కలిపి ఒక “ఐ పోడ్ నానో” ఒకటి ఇస్తున్నాడట. ఇదే బెస్టు ఆఫర్, గిఫ్ట్ కార్డులు కావాలంటే మా పాత డెంటిస్టు దగ్గరకెళ్లొచ్చు” అని, దూరంగా చూస్తూ” ఇప్పుడే వస్తానండీ…”అని కనబడ్డ మరో కొత్త వ్యక్తి వైపు నడిచేడాయన.
డా|| కె.గీత
-www.andhraprabha.com/columns/column-no7-by-dr-geetha-madhavi/4801.html
First Published: 17 Oct 2013
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s