మంచు గబ్బిలం

ఎముకలు కొరికే చలిలో

ఆరో వీధి చెత్తకుప్ప సందులో

తెల్లారగట్ల అట్టముక్కల మధ్య

ఎండిన చెక్కపొట్టు మధ్య చుట్టబెట్టిన ఆకారం

నిద్రలోనూ సలుపుతున్న ఆలోచన్లలా ఉలిక్కిపడ్తూ

చివికిన బొచ్చు తల తోపీ లోంచి మకిలి దొర్లుతున్న జుట్టు

లోపల గాయాలు రేగి చర్మం వేళ్లాడుతున్నట్లు అసహనంగా కదిలే తుప్పు బూట్లు

ఎప్పుడు లేస్తుందో తెలీదు

రోజల్లా రోడ్లపై దొర్లించుకుంటూ తిరిగే

షాపింగు కార్టే సర్వస్వం

అట్టముక్క మీద

పెన్నీ దానం చెయ్యండి

హోంలెస్ ప్లీజ్ హెల్ప్

వర్క్ ఫర్ ఫుడ్

నిశ్శబ్దంగా అర్థించేదేదైనా

కూలబడ్డ కళ్లల్లో కనిపించేదొకటే

అమెరికా రోడ్డు మీద

గూడు లేని పౌరుడికి

వెచ్చని ఆశ

నిలువెల్లా వణికే మనిషికి

గుండె లో ఎక్కడో

బతికించే

ఒక వెచ్చని ఆశ

స్నానం పానం లేని

బట్టల వెనుక శరీర దుర్గంధాన్ని

శరీరం కంటే పుచ్చిన చెత్త కుప్ప వాసనని

దంత ధావనం లేని గొగ్గి పళ్ల కింద నలిగే గంజాయి

గొయ్యి తీసి శవాన్ని కప్పెట్టినట్టు దాచి పెడుతుంది

అతను ఒకప్పుడు అన్నీ ఉన్నవాడు కావచ్చు

నిరుద్యోగం ఇంటిని

గూడులేనితనం బంధాల్ని

మింగేస్తాయిక్కడ

అతనెంత పనిమంతుడైనా కావొచ్చు

చిరునామా లేకుండా ఐడెంటిటీ

ఉనికి లేకుండా ఉద్యోగం

ఉండవిక్కడ

వేల సంఖ్యలో పదులకు మాత్రమే దొరికే వసతి గృహం

రోజూ వారీ నిరాశ బతుకుల పాలిటి చీకటి లాటరీ

ప్రతీ మధ్యాహ్నం నుంచీ వంతు కోసం కొట్టుకునే గుండెకి

రోడ్డు పక్కన , పార్కు లోపల, పదిమంది తిరిగే చోట

స్వేచ్ఛ గా నిద్రపోనివ్వని కఠిన నిబంధనల దేశమిది

రాత్రంతా పోలీసుకంట పడకుండా

పరుగెత్తే కాగితం చుట్ట

తిరిగి తిరిగి ఎక్కడో ఒక ఇరుకు

కుప్ప పక్కన పడేసిన

సామాన్లలో విరిగిన బల్లలా

కాళ్లూ, చేతులూ కడుపులోకి విరుచుకుని

తెల్లారగట్ల చలిని మునిపంట

కొరికే ఆకారం

భూతల స్వర్గపు వీధుల్లో

మంచు గబ్బిలమై వేళ్లాడుతూ *

————

-డా||కె.గీత

http://www.koumudi.net/Monthly/2014/january/jan_2014_kavitha_koumudi.pdf

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

4 Responses to మంచు గబ్బిలం

  1. kalageeta అంటున్నారు:

    Thanks

  2. Karthik అంటున్నారు:

    Geetha garoo chaalaa chaalaa bagundi:-):-)

  3. kalageeta అంటున్నారు:

    Thanks Padmaja garu-

  4. Padmaja అంటున్నారు:

    గీత గారు, మీ పోస్ట్స్ చాలా బాగున్నాయి.. అన్ని చదువుతున్నా! మీరు వ్రాసిన ఈ కవిత చాలా హృద్యంగా వుంది, నేను కూడా చాలా సార్లు ఇదే అనుకుంటాను.. అమెరికా ఎంత developed country అయి ఏమి ప్రయోజనము, పేదవాళ్ళ కి ఇంత గూడు కల్పించలేకపోయినప్పుడు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s