అనగనగా అమెరికా-17(అసలు దీపావళి)

 “దీపావళి హడావిడి మనింట్లో ఒక రోజు ముందే ప్రారంభమయి పోయిందన్న మాట” అన్నాడు కృష్ణ ఇంట్లోకొస్తూనే, ఇండియాకి ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతున్న రాణిని చూసి.

“అవును మరి వాళ్లకిప్పుడు ఉదయం కదా. అందరికీ శుభాకాంక్షలు చెప్పొద్దా” అని బిజీ అయిపోయింది మళ్లీ.

రాణి తరఫు వాళ్ల బాచ్ అయ్యాక, కృష్ణ తరఫు ఫోన్లు మొదలయ్యాయి మరో గంట.

“ఊ.. మమ్మీకి ఇదే అసలు దీపావళి డాడీ” అంది చిన్నూ.

మర్నాడు అమెరికాలో దీపావళి రానే వచ్చింది.ఎప్పటిలా పొద్దున్నే ఆఫీసు, స్కూలు అంటూ ఉరుకుల పరుగుల రోజుగానే మొదలయ్యింది ఆ రోజు కూడా.

“ఏవండీ దీపావళి కదా సాయంత్రం గుడికెళ్లొద్దాం.” అంది రాణి.

“ఏంటి మమ్మీ, ప్రతీ దీపావళికీ గుడికి అంటావు”  చిన్నూ ప్రశ్నకి”అమెరికాలో ఇంత కంటే ఏం చేస్తామమ్మా” అంటూ “పండగ అంటూ సెలవు కూడా పెట్టరు వీళ్లు”  అని మనసులో నిట్టూర్చింది.

సాయంత్రం ఇంటి నించి తెచ్చిన నేతిలో నానబెట్టిన ఒత్తుల పేకెట్టు,  కొబ్బరి కాయ గుడి ఎంట్రెన్సులో ఉన్న అట్టపెట్లో వేసి లెంపలేసుకుంది.

కాస్సేపు కూచుని వెళ్దామన్న రాణి ఎంతకీ లేవకపోవడంతో “వచ్చీ పోయే జనాన్ని చూసింది చాల్లే. రేపసలే వర్కింగ్ డే” అన్నాడు కృష్ణ.

“అబ్బ, పండగ పూటా మన మొహాలు మనం చూసుకోవడమే కదా. పది నిమిషాలాగి వెళదాం” అంటున్న రాణికి వంత పాడింది చిన్నూ.

“అవును డాడీ, గుళ్లో చాలా బావుంది. ఇంటికెళ్లితే అమ్మ  పది నిమిషాల్లో కాకర పువ్వొత్తులు వెలిగించమని దీపావళి అయిపోయిందంటుంది.”

“నువ్వేగా గుడికెందుకు అన్నావు పొద్దున్న” నవ్వుతూ తల మీద రాసేడు కూతురికి.

“దీపావళంటే కాకర పువ్వొత్తులు కాల్చడమేనా డాడీ” అంది మళ్లీ  చిన్నూ.

“అవునమ్మా, అవైనా దొరుకుతున్నాయి సంతోషించాలి.  ఏదో వెల్తురు మాత్రమే వచ్చే ఉత్తుత్తి కాకరపువ్వొత్తులవి. లేకపోతే పర్మిషన్ ఉండదు కదా” అంది రాణి.

ఒక కొవ్వొత్తి వెలిగించి అపార్ట్‌మెంటులో కార్పెట్టు లేని బాల్కనీ లోకి వెళ్లి త్వరత్వరగా కాకర పువ్వొత్తులు వెలిగించారు. ఆ మాత్రానికే కేరింతలు కొట్టింది చిన్నూ.  కానీ ఇండియన్ డ్రెస్సు వేసుకున్నందుకు బాబోయ్ చికాగ్గా ఉందని సాయంత్రం నించీ పేచీ పెడుతూనే ఉంది.

పేకెట్టు అయిపోగానే చప్పున కొవ్వొత్తి ఊది, “మేనేజ్‌మెంటు వాడు చూసేడంటే కొంపమునుగుతుంది రండిక లోపలికి” అంది రాణి.

కష్టపడి వండిన పదార్థాలు సగమే సేలయ్యాయి.

“ఏమిటివన్నీ ఫ్రిజ్‌లోకేనా? అంటే రేపట్నించి ఎన్నాళ్లు తినాలో” అంటున్న కృష్ణతో

“పక్కింటి వాళ్లకి కాస్త పులిహోర, పరమాన్నం ఇచ్చి రావడాల్లేవుగా ఇక్కడ, మరేం చేద్దాం?” అంది.

“ఇండియాలో ఉన్నంత సేపూ, ఇంత డబ్బు తగలేసి ఇన్నేసి సామాన్లు కాల్చాలా అని సణిగే దానివి. ఇప్పుడు నీకా బాధ తప్పింది కదా సంతోషించు” అన్నాడు  కృష్ణ .

“అమెరికా వచ్చి దీపావళి మారినా ఇతను మారడు ” అని నెత్తి కొట్టుకుంది.

“అది కాదోయ్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా జీవితాన్ని గడపాలి. అక్కడున్నపుడు అన్నేసి డబ్బులు తగలేసి సామాన్లు కాల్చుతాం. ఇక్కడ కాసిన్ని కాకరపువ్వొత్తులతో సరిపెట్టుకుంటాం. అసలు పండగ ఆనందం మనస్సులో ఉండాలి.” అన్న కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూసింది రాణి. “అందుకేనేమో దీపావళి పూట కూడా ఆఫీసుకి సెలవు పెట్టంది ” అంది.

http://www.andhraprabha.com/columns/%E0%B0%85%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A6%E0%B1%80%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B3%E0%B0%BF/9390.html

– డా|| కె.గీత

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s