అనగనగా అమెరికా-23(ఒన్ ఎల్బీ)

 

ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నారా ఈ వారంలో అని మెయిల్ వచ్చింది నాకు.

నా స్నేహితులొకరిద్దరి తల్లిదండ్రులు వచ్చేట్లున్నారు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి, అమెరికాకి చుట్టాలు రావడమంటే ఒక పూటకో, వారానికో కాదు. ఏకంగా నెలల తరబడే. సంవత్సారానికోసారే వచ్చినా, వచ్చిన వాళ్లు కనీసం రెండు మూడు నెలల నించి ఆర్నెల్ల వరకూ ఉండి వెళ్లడం రివాజు.

సాధారణంగా ఇక్కడ వేసవిలో వాతావరణం కాస్త వెచ్చగా మామూలుగా ఉంటుంది కాబట్టి, మార్చి, ఏప్రిల్ నెలల్లో, ఇండియా నుంచి అమెరికాకు వచ్చే తలిదండ్రుల ట్రాఫిక్ మొదలవుతుంది.

అలా వచ్చిన వాళ్లు వెనక్కి వెళ్లే సమయం కాబట్టి అక్టోబరు, నవంబరు నెలల్లో అమెరికా నుంచి వెనక్కి ఇండియాకి వెళ్లే ట్రాఫిక్ ఉంటుంది.

ఇక ఇక్కడి వేసవి సెలవులు జూన్ నించి ఆగస్టు వరకూ ఉంటాయి కాబట్టి ఆయా నెలల్లోనూ, డిసెంబరు‌లో క్రిస్మస్ సెలవులు రెండు మూడు వారాలుంటాయి కాబట్టి జనవరి వరకూ కుటుంబాల ట్రాఫిక్ ఉంటుందన్న మాట.

ఇక అమెరికాలో పిల్లల్ని కంటే ఇక్కడి నిబంధనల ప్రకారం ఆ పిల్లలు సిటిజన్లు అవుతారు గనక, కాన్పుకి ఇండియాకి వెళ్లడం కాకుండా ఇక్కడికే తల్లిదండ్రుల్ని రప్పించుకుంటారందరూ. కావాలంటే కాన్పు అయ్యాక, ఏ మూడో నెల్లోనో, కూడా తీసుకెళ్లి పంపుతారన్న మాట. ఇలా కాన్పుల ట్రాఫిక్కూ… ఇలా సంవత్సరం మొత్తం ఇండియా నుంచి  సంవత్సరం పొడవునా ఎవరొకరు వచ్చి పోతూనే ఉంటారు.

అలా వస్తూ పోతున్న వాళ్లు  తెలిసిన వాళ్లకి వాళ్ల వాళ్లు ఇచ్చినవేవో కాస్త కాస్త పట్టుకు రావడం, తీసుకెళ్లడం పరిపాటి.

ఆ ఈ మెయిల్ నాకు తెలిసిన అందరికీ ఫార్వర్డు చేశాను. మా పిన్ని కూతురు ఫోన్ చేసింది. ‘అక్కా, వచ్చే వారం మా అత్తగారు వాళ్లూ వస్తున్నారు, ఆ ఈమెయిల్ ఆవిడకి  చెప్పు ఒక ఎల్బీ సాయం చేస్తారు’ అని చెప్పింది.

ఒక lb అంటే ఇంచుమించు అరకేజీ. సాధారణంగా ఒక్కో మనిషికి రెండు సూట్ కేసులు, ఒక్కో సూట్ కేసులో 23 కేజీలు మాత్రమే వెంట తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా సాయం అడిగే వాళ్లందరికీ సాధారణంగా అంతా ఒక lb అని చెప్పడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఇలా పది మందికి పది ఎల్బీలు తెస్తే తలా కాస్త సాయం చేసినట్లవుతుందని అందరి అభిప్రాయం అనుకుంటా.

ఇంతకీ ఆ తెచ్చే ఒక lb స్వీట్లో, కారమో, చింతపండో వాళ్లింటి నుంచి తెచ్చుకోవడానికి ఇక్కడి వాళ్లకు పెట్రోలు ఎంతవుతుందో అటూ, ఇటూ ఎవరూ లెక్కేసుకోరన్నమాట వాస్తవం.

ఈ మెయిలావిడని అదే అడిగాను. ఇంతకీ ఒక lbలో మీకేం కావాలండీ అని.

‘ఏవీ లేదండీ, ఊర మిరప కాయలు మా ఊరి నించి మా అమ్మ మా అత్తగారికి పంపిందట. అవి ఇక్కడకు తెచ్చిపెట్టేవాళ్లు లేరు. మీ వాళ్ళు రెండు lbలు తెస్తారేమో కనుక్కోండి’ అంది.

ఇంతకీ  వాళ్ల అమ్మగారిల్లు ఎక్కడో, అత్త గారిల్లెక్కడో అడిగాను.

ఆవిడ అమ్మ గారిల్లు అమలాపురం, అత్తగారిది హైద్రాబాదులో దిల్ షుక్ నగర్.

ఇంతకీ అమెరికా వచ్చే మా పిన్ని కూతురు అత్తవారు కూకట్ పల్లి. అమలాపురం నుంచి హైద్రాబాదుకి, హైద్రాబాదులో దిల్‌షుక్ నగర్ నిుంచి, కూకట్ పల్లికి, ఇక  ఇక్కడ అమెరికాలో 20 మైళ్ల దూరంలో ఉన్న ఈ మెయిలావిడ దగ్గరికి ఈ మిరపకాయలు ప్రయాణం చెయ్యాలి.

ఇంత దూరం ఆ మిరప కాయలు తెప్పించుకునే శ్రమ, ఓపిక మధ్యలో అలుపెరగక తెచ్చి ఇచ్చే వాళ్లున్నా  2lbలు తెచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండదని మొదటే చెప్పేరు వాళ్లు.

అందుకే “ఎందుకండీ అంత శ్రమ పడి ఒన్ ఎల్బీ సరుకులు తెప్పించుకోవడం’ అన్నాను.

‘అదేవిటండీ అలా అంటారు! తెచ్చేది ఎంత తక్కువైనా అదో తృప్తి కదండీ’ అని గొప్ప విషయం చెప్పింది నాకు.

……………

First Published: 24 Feb 2014

http://www.andhraprabha.com/columns/anaganaga-america/12832.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s