అనగనగా అమెరికా-24(గవర్నమెంట్ షట్ డౌను – గాడిదగుడ్డు)

ఆ వారం తెలుగు పీపుల్ పాట్లాక్ జరిగింది. ఇలాంటి పాట్ లాక్కులు సాధారణంగా ఎలా జరుగుతాయంటే, స్థానిక తెలుగు సంస్థ ఒకటి తెలుగు వాళ్లనుకునే వాళ్లందరికీ ఏదో ఒక పార్కులో ఫలానీ వారం పాట్లాక్ అని ఈ మెయిల్ పంపేస్తారు. అప్పటికి ఓపిక ఉన్న వాళ్లు తమ కూడా వచ్చే వాళ్లకు సరిపడా వండుకు వస్తే చాలు. అలా తెచ్చుకున్నవి అంతా పంచుకు తిని, కాస్సేఫు కబుర్లు చెప్పుకునీ, ఆడుకునీ, మరి కాస్సేపు ఆ సంస్థ చేస్తున్న గొప్ప పనులని విని రావడమన్న మాట.

అయితే అలా చేరడం ఇక్కడి వాళ్లకు ఆటవిడుపని అనుకోవడం పొరబాటు. ఇండియా నుంచి వచ్చిన పెద్దవాళ్లకు ఇలాంటిదొకటి చూపించి ఇక్కడి సమూహాన్ని పరిచయం చెయ్యడం, ఇంత దూరంలో ఇండియాలో కంటే గొప్పగా ఇక్కడ సంస్కృతీ, సాంప్రదాయాల్ని ఎలా బాగు చేసేస్తున్నారో చూపించడం మరొకటి కారణాలనేది అసలు సత్యం.

మేమూ మా వెంట మా అత్తగారినీ, మావగార్నీ తీసుకెళ్లాం.

ఆవిడ సంతోషానికి హద్దూ పద్దూ లేదు. అచ్చు మన దగ్గర వన భోజనాల్లాగే చక్కగా ఉంది, పైగా కట్టు బొట్టూ అంతా తెలుగు వాళ్లమని ఎంత బాగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నారో.

అని ఆనంద పడిందావిడ. ఆవిడ సంతోషం చూసి మా ఆయన ముఖమూ వెలిగి పోయింది.

పిల్లా, పాపల్ని కలిపి ఆటల పందేలు, మగవాళ్లకు వేరే, ఆడవాళ్లకు వేరే ఖుషీ కార్యక్రమాలు …

హుషారుగా అంతా జట్లు జట్లుగా తిరగడాలు.. అంతా బాగానే ఉన్నాయి.

మేం ఒకరిద్దరు ఉత్సాహవంతులం అలా గుంపుల్లో కలిసి కాస్సేపు మాట్లాడి వద్దామని పరిచయమున్న వాళ్ల దగ్గిరికి  వెళ్లి, వాళ్లతో ఉన్న పరిచయం లేని వాళ్లని పరిచయం చేసుకుంటూ తిరుగుతున్నాం.

ఇంతలో ఎవరో ఒక నిరాశా వాది, అవతల గవర్నమెంటు షట్ డౌన్‌తో దేశం తలమునకలవుతూంటే మనకీ వన భోజనాలేవిటండీ అన్నాడు.

అది విన్న చుట్టుపక్కల వాళ్లు ఆ విషయం పట్టించుకోకుండా మరేదో మాట్లాడడం చూసి, ఏవిటండీ ఆయన కరెక్టు ప్రశ్న అడిగేరు. మీరంతా పట్టించుకోరేమిటీ   అన్నాడొకాయన.

ఆ మాటకి ‘ఇలా చూడండి, ఏదైనా ఉపద్రవమొచ్చి పడి, మనల్ని వెళ్లగొట్టేరే అనుకోండి, ఇంచక్కా పోతాం తట్టాబుట్టా సర్దుకుని అనొకరూ, ఏదో డాలరు ధర బావుందని కానీ, ఈ దేశంలో మనకేం పనండీ’ అనొకరూ అన్నారు.

ఇంతలో మరొకాయన, ‘ఏవండీ ఈ దేశపు గొడవలు మనకెందుకండీ. ఇదే మన దేశంలో అయితే ప్రత్యక్షంగా రోడ్ల పైన కనబడుతుంది ఏ సమస్యైనా. ఇక్కడ వైట్ హౌస్ ముందో, స్టాక్ మార్కెట్టు వీధిలోనో తప్ప పట్టించుకునే నాథుడేడీ. ఇక్కడి వాళ్లకే లేనప్పుడు ఎక్కడ్నించో ఉద్యోగార్థం వచ్చిన వాళ్లం మనకెందుకండీ’ అన్నాడు.

చివరికి ఒకాయన ‘అవునండీ గవర్నమెంటు షట్ డౌను- గాడిదగుడ్డూ మనకెందుకు మనం మనం హాయిగా ఇలా సంస్కృతిని బతికించుకునే కార్యక్రమాలు చేసుకోవడమంత ఉత్తమం ఇంకోటి లేదు. అదిగో  అక్కడ మన సంస్థ ప్రెసిడెంటు వచ్చే పండక్కి మనమెక్కడ కలవచ్చో చెప్తున్నాడు వినండి’ అని లేచాడు.

……………….

First Published: 28 Feb 2014

http://www.andhraprabha.com/columns/anaganaga-america-24/13108.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s