అనగనగా అమెరికా-25(అమెరికా చదువు)

ప్రసన్నా లక్ష్మీ నారాయణకి అమెరికాలో ఎమ్మెస్‌కి సీటు వచ్చింది.

ఇండియాలో లాగా ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ, ఒక సంవత్సరాంతపు పరీక్ష చకచకా గీసి పడేద్దామని మాంచి హుషారుగా వచ్చేసాడు అమెరికాకి.

ఇండియాలో ప్రైవేటు కాలేజీ లో బీటెక్ వెలగ బెట్టి వచ్చాడన్నమాటే గానీ ప్రోగ్రామింగంటే బొత్తిగా పడదు. లాబ్‌లు ఎలాగో గట్టెక్కాడో భగవంతుని కెరుక.

రాబోయే కాలంలో కాబోయే కంప్యూటరింజనీరుగా కలలు మబ్బుల్లో కంటూ అమెరికా వస్తూనే కాలేజీలో ఫస్టు సెమిస్టర్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ తీసేసుకున్నాడు.

మొదటి రోజునే ప్రొఫెసరు అందరినీ హెచ్చరించాడు. నా క్లాసులో బేసిక్ ప్రోగ్రామింగు రాని వాళ్లు డ్రాపవచ్చు. అదీగాక మహా కష్టాతికష్టమైన సబ్జెక్టు ఇది అని.

అయినా ప్రసన్నకి అదంతా అందరూ చెప్పే గొప్ప కబుర్లనీ, అమెరికా ప్రొఫెసర్లకి ఏమీ రాదనీ, అయినా బేసిక్ ప్రోగ్రామింగు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదనీ ఎవరో మిత్రుడు చెప్పడం వల్ల, అభయం ఇవ్వడం వల్ల చేరిపోయాడు.

అమెరికా ప్రొఫెసర్లకి ఏమీ రాదనేది వాస్తవం అవునో కాదో కానీ, అతి తెలివి మాత్రం ఉంటుందన్న విషయం మర్చిపోయాడు పాపం ఆ మిత్రుడు.

ఇక్కడి ప్రొఫెసర్లకి అసలు చెప్పాల్సిన సబ్జెక్టు రాకపోయినా కౌ కాంపోజిషన్ లాగా వాళ్లకొచ్చిన సబ్జెక్టు నెత్తిన రుద్దుతార్రా బాబూ అని మరో మిత్రుడు హెచ్చరించాడు.

ఆ మాట అక్షరాలా సత్యమన్నది అర్థమయ్యేసరికే ఆలస్యమైంది. క్లౌడ్ కంప్యూటింగ్ క్లాసులో భీభత్సమైన ప్రోగ్రామింగు అసైన్మెంట్ల ధాటికి సాలెగూట్లో చిక్కిన ఈగలా గిలగిలా కొట్టుకోవాల్సొచ్చింది. ఆ ప్రొఫెసరు ప్రోగ్రామింగు పిచ్చోడన్నది పక్కన బెడితే, కంప్యూటరు భాష తప్ప విద్యార్థులు అడిగిన ప్రశ్నలను సరిగా అర్థం చేసుకునేపాటి ఇంగ్లీషు కూడా రాని వాడని ఆయన తిక్క సమాధానాలు చూసి అర్థమయ్యేక దాదాపు మతిపోయింది ప్రసన్నకి.

మొదటి పాఠం అవుతూనే మరుసటి వారానికల్లా తొలి ప్రోగ్రామింగు అసైన్‌మెంటు, వారాంతానికల్లా క్విజ్ అసైన్మెంటు, వారానికో  ఒక ల్యాబ్,  ఆ పై వారంలో  రెండు మూడు రాత పరీక్షలు  చొప్పున ఉక్కిరిబిక్కిరవ్వడం మొదలైంది.

అక్కడితో కథ అయిపోయిందనుకుంటే పొరబాటే. స్టూడెంటు వీసా వల్ల మొత్తం మూడు క్లాసులకు తక్కువ కాకుండా తీసుకోవాల్సి వచ్చింది.

మరొకటి మేథ్స్ క్లాసు, మరొకటి తేలిక పాటి ఇంగ్లీషు తీసుకున్నా అవీ వారానికి రెండు, మూడుకి తక్కువ కాకుండా అసైన్మెంట్లతో ప్రత్యక్షమయ్యాయి.

వెరసి వారానికి ఆరు పరీక్షలు, అరవై రీసెర్చి పేపర్లలా తయారైంది చదువు.

ఇండియాలో గప్పాలు కొట్టినంత సులువు కాదు ఇక్కడి చదువని అర్థం కావడానికి ఒక నెల కూడా పట్టలేదు. పైగా కల్లోనూ వణికించే ఫీజుల స్టూడెంటు లోనొకటి.

పొద్దస్తమానూ కంప్యూటర్లలో రీసెర్చి చేస్తూ చదువు, ఎప్పుడు చూసినా టైపింగులతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అమెరికా చదువులేవిటో అర్థం కాని గాభరా పట్టుకుంది.

‘ఏమైందితనికి వచ్చిన కొత్త లో ఎప్పుడూ నవ్వుతూ,  ఉత్సాహంగా అందరితో కల్పించుకుని మాట్లాడేవాడుతూండేవాడు కదా’ అన్నాడొక మిత్రుడు ఈ మధ్య ఇతని వాలకం చూసి.

ఎవరు పలకరించినా కయ్యిమనే దశకి వచ్చేసాడు.

‘ఇతనిప్పుడు ప్రసన్న నారాయణ  కాదురా, ఉగ్ర  నారాయణ. అమెరికా చదువుకిలా అయిపోయాడు పాపం’ అని పెదవి విరిచాడు మరో మిత్రుడు.

…………..

First Published: 08 Mar 2014

http://www.andhraprabha.com/columns/anaganaga-america-25/13562.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s