అనగనగా అమెరికా 27(పెళ్లి- పేరంటం)

పెళ్లి- పేరంటం

 

శాంభవికి మనో వేదన తప్ప ఏమీ మిగలడం లేదు అమ్మాయిల పెళ్లిళ్ల విషయం తల్చుకుంటే. పిల్లలిద్దరూ అమెరికాలోనే పుట్టి పెరిగారు. చక్కగా చదువుకున్నారు. ఉద్యోగాలూ చేస్తున్నారు. వచ్చిన చిక్కల్లా ఒక్కటే.. ఈ మధ్యే పరిచయమైన ఇండియన్ వాకింగు ఫ్రెండుతో తన బాధ వెళ్లబోసుకుంది.‘ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, నిరంతరం ఒకటే ఆలోచన, అస్సలు బుర్రను వదలడం లేదు’.’అదేవిటండీ, చక్కని సంసారం, ముచ్చటైన పిల్లలు.. మీకు బాధలేవిటీ, ఉంటే గింటే మా బోటివాళ్లకుండాలి గానీ అందా ఫ్రెండు’.’పిల్లల్ని మన సంప్రదాయం ప్రకారం అతి కష్టమ్మీద పెంచుకొచ్చేం..”అవునవును, మీ పిల్లలు బుద్ధిమంతులు..”అదే వచ్చిందండీ బాధ, పెళ్లీడు వచ్చి, దాటి పోతున్నా పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు’.’అదేవిటండీ, ఇండియా నుంచి మంచి సంబంధాలు వెతకడమే..”అదేనండీ చిక్కు, ఇండియా నుంచి మంచి సంబంధాలని మనం అనుకుంటున్నవి ఇండియాలో పుట్టి పెరిగిన పిల్లలకు, ఇక్కడి పిల్లలకు కాదు. ఇక్కడి అమ్మాయిల మనస్తత్వాలకు, ఇండియాలో పెరిగిన అబ్బాయిల మనస్తత్వాలకు ససేమిరా కుదరదు’.’పోనీ ఇక్కడే పెరిగిన ఇండియన్ అబ్బాయిల్ని చూడలేక పోయారా?’అయ్యో, అదీ అయ్యిందండీ. డేటింగ్ చెయ్యని ఇండియన్ కుర్రాడు దొరకడం లేదంటే నమ్మండి’.’మరి..ఎవరినైనా చూసి..’ అని నసిగింది ఫ్రెండు.’అలా సంప్రదాయం మంటగలిసిపోవడానికి నేను, మా వారు బద్ధ వ్యతిరేకులం, అందుకే మా పిల్లలని చిన్నప్పటి నుంచి మంచి కట్టుదిట్టాలతో పెంచేం, ఇక్కడి పోకడలూ, పద్ధతులూ జోలికి పోనివ్వలేదు’ అని తేల్చింది.అలా ఎలా పెంచేరో అర్థం కాక తెల్ల మొహం వేసింది ఫ్రెండు.పైగా అడిగింది కూడా..’అలా ఎలా పెంచాలో చెప్పండీ బాబూ, మా పిల్ల మూడో తరగతికే మాట వినడం లేదు’ అంది కుతూహలంగా.ఏవుంది, వాళ్లని వీలైనంత వరకు మన వాళ్ల మధ్య తిప్పండి, గుడీ, గోపురం…’ అంటూ ఒక పెద్ద లిస్టు చెప్పుకొచ్చింది శాంభవి.’అయితే అలా ఇవన్నీ అలవాటు చేస్తే మనం చెప్పినట్లు పెరుగుతారంటారు, మరి సమస్య ఏవుందండీ’ అంది.’మనం మన సంస్కారాన్ని నేర్పించగలం కానీ, మానసిక పరిణతిని ఆపలేమండీ. ఇక్కడి పిల్లలు చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేర్చుకున్నవి ఎలా చెరిపి పారేస్తాం’ అని మళ్లీ అందుకుంటూ..’అలాగని పెళ్లీ గిళ్లీ చేసుకోకుండా కలిసి ఉండడం లాంటివి మేమస్సలు సహించలేం’ అంది శాంభవి.’పిల్లల్ని మనలా పెరగడానికి అనువైన ఆరోగ్యకరమైన పరిస్థితులూ లేవాయె ఇక్కడ, ఏం చేస్తాం లెండి’,’ఇలా పెళ్లి- పేరంటాల బాధ పళ్ళేకే  మేం పిల్లలు హైస్కూలుకి రాగానే వెనక్కి వెళ్లి పోదామా అని ఆలోచిస్తున్నాం’ అని నిటూర్చింది ఫ్రెండు.

————

 
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s