అనగనగా అమెరికా-40 (అమెరికా టు ఇండియా – ఇండియా టు అమెరికా)

అనగనగా అమెరికా-40
అమెరికా టు ఇండియా – ఇండియా టు అమెరికా

ఆ రోజు బర్త్ డే పార్టీ లో కలిసిన వాళ్ళలో వాడిగా, వేడిగా  వెనక్కి ఇండియా కి వెళ్ళిపోవడం పట్ల చర్చ జరుగుతూంది.

అమెరికా నించి ఇండియా తిరిగి వెళ్లి పోయి స్థిరపడదామన్న ఆలోచన ఇక్కడికి వచ్చిన 5 సం.రాల వరకు అందరికీ ఉంటుంది. పిల్లల్ని ఇక్కడి సంస్కృతి లో పెంచడానికి  భయపడో, అక్కడి కుటుంబ సభ్యుల్ని వదులుకోలేకో, కాస్త డబ్బు చేసుకున్నాక తిరిగి శేష జీవితాన్ని హాయిగా స్వదేశంలో గడపవచ్చనో…

రకరకాల కారణాల వల్ల వెనక్కి వెళ్లిపోయేవాళ్లు ఉండేవారు ఇంతవరకు.

అయితే అలా వెళ్లిన వాళ్లు సరిగ్గా సంవంత్సరంలోనో, రెండేళ్లలోనో, మరలా పిల్లలు సరిగ్గా ఏ ఇంజనీరింగులకు వచ్చేసరికో జ్ఞానోదయమై తిరిగి వచ్చేస్తూండడం పరిపాటి.

ఇలా తిరిగి వచ్చేయడానికి రకరకాల కారణాలు- పిల్లలు అక్కడి వాతావరణానికి పద్ధతులకు అలవాటు కాలేక పోవడం, పొల్యూషన్, కుటుంబ తగాదాలు వంటివి ఉండేవి.

ఇప్పుడొక కొత్త సమస్య వచ్చిపడింది. గత ఏడాదిగా తిరిగి వచ్చేసిన వాళ్ళంతా ఇదే కారణమే చెప్తున్నారు.

ఇంతలో శైలజ కనిపించింది.

శైలజ కిందటేడాది వాల్ మార్ట్ లో కనిపించి, వచ్చే వారం “మూవింగ్ ఇండియా ఫర్ గుడ్” అని చెప్పింది.

ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యే సరికి

“ఏవిటీ, మీరు ఇండియా వెళ్లలేదా , అని అడిగాను.”

“అయ్యో, వెళ్లడమూ అయ్యింది, రావడమూ అయ్యింది.” అంది నిట్టూరుస్తూ.

“అదేవిటి?” అన్నాను.

నన్ను చుట్టూ  ఇదే విషయం గురించి మాట్లాడుతున్న వారికి  పరిచయం చేసింది.

“ఇప్పట్లో ఇక ఇండియా తిరిగి వెళ్లే ఆలోచనలు మానుకోవాల్సిందే” అన్నాడొకాయన.

“ఏవిటండీ విషయం” అన్నాడు నాలా  అప్పుడే గుంపులోకి వచ్చిన కొత్త మనిషి.

“ఇంకా ఏం చెప్పాలండీ, రాష్ట్రాలు విడి పోవడం కాదుగానీ, అందరికీ పెద్ద సమస్య అయ్యికూచుంది. అక్కడెవ్వరికీ బతుకు లేదు, ముఖ్యంగా మనశ్శాంతి  లేదు.”

“ఫీజుల రీ  ఎంబర్స్మెంట్ల దగ్గర్నించీ, రియల్ ఎస్టేట్ వరకూ స్థానికతల వేర్పాట్లు, వివాదాలు  సామాన్యుల దగ్గిర్నించీ అన్ని వర్గాల్నీ కుదిపేస్తున్నాయి.”

“ఏవండీ, అమెరికాలో ఇప్పుడు మా ఆయన పనిచేసే వాళ్ల ఆఫీసు హైదరాబాదులో బ్రాంచి పెడతామన్నారని వెళ్లమా, రాష్ట్రాల విభజన దెబ్బకి ఆఫీసుని హైదరాబాదులో పెట్టే ప్రయత్నం విరమించుకుని బెంగుళూరు లో ప్రారంభించేరు. ఇక మేం  బెంగుళూరు లో ఉండడం కంటే అమెరికాలో ఉండడమే నయమని మళ్లీ  వెనక్కి వచ్చేసాం.” అంది శైలజ.

“చరిత్ర నేర్పే గుణ పాఠాల్లో, ఇదొక గొప్ప గుణ పాఠం మనుషులకి. నాకు తెలిసి 1980 ల నించి డిగ్రీ చదువుకున్న ప్రతీ ఒక్కడూ హైదరాబాదు రైలెక్కేడు. జీవనం అంటే హైదరాబాదు అన్నట్లు ఉన్న ఊర్లలో అన్నీ తెగనమ్మి ఆ చుట్టుపక్కలే స్థిర పడ్డారు. చూడండి ఏం జరిగింది చివరికి? ఒక్క ఫీజు వివాదమే తీసుకుంటే, ఇప్పుడు తెలంగాణా లో పుట్టిన 25 సం.రాల లోపు ఆంధ్ర సంతతి వాళ్లెవ్వరూ  తెలంగాణా వాళ్లు గా పరిగణించ బడరు. ఇక  తెలంగాణాలో పుట్టిన కారణంగా  వీళ్లు ఆంధ్రాలో నాన్ లోకల్ పీపుల్. ఖర్మ…ఖర్మ…. అంతే…”అన్నాడు ఇండియా నించి చుట్టపు చూపుగా వచ్చిన హిస్టరీ లెక్చరర్ ఒకాయన.

“అవునండీ, నాకు తెలీకడుగుతాను,  స్థానికతకి ప్రమాణంగా 1956 కంటే ముందు స్థిరపడడాన్ని క్రైటీరియా గా తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారని విన్నానే. అదేదో మరి రెండేళ్లు వెనక్కి జరిపి, “1954 నించి  పుట్టిన వాళ్ళంతా” అని రూల్ పెడితే ముఖ్యమంత్రి కూడా వెనక్కి వెళ్లాల్సిందేగా…”అని, “అయినా నాకెందుకులెండి” అంది రహస్యంగా ఒకావిడ.

……………….

-కె.గీత

http://www.andhraprabha.com/columns/a-column-by-kgeetha-madhavi/19936.html

First Published: 14 Jul 2014 in Andhra Prabha

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s