అనగనగా అమెరికా-43 (రిక్వైర్మెంటు)

అనగనగా అమెరికా-43
రిక్వైర్మెంటు

వినీత్ మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవమని, అందులోనూ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చెయ్యమని తల్లి మొదట్నించీ పోరు పెట్టింది.

కానీ వినీత్ కి ఎందుకో తెలీదు కానీ గంటలు గంటలు రోజంతా కంప్యూటర్ల ముందు గడిపే ఉద్యోగాలు నచ్చవు.

“బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరి స్క్రీన్ ముందు వాళ్లు కూచుని “టెక్నాలజీ” పరుగులో జీవితాల్ని త్యాగం చేసి డబ్బు చేసుకొనే ఉద్యోగాలమ్మా అవి. నాకు మనుషులు మనుషుల్లా కాకుండా మరల్లా బతికే జీవితం ఇష్టం లేదు” అని సమాధానం చెప్పేడు.

కానీ అతనికి తెలియని విషయం ఇక్కడ ఒకటుంది. ఆ విషయం అతనికి ఉద్యోగం కోసం కన్సల్టెన్సీని సంప్రదించే వరకూ అర్థం కాలేదు.

కన్సల్టెన్సీ లో ఇతని క్రెడెన్షియల్స్ అన్నీ పరిశీలించి ఇలా చెప్పేరు.

“నీ గ్రేడ్స్ బావున్నాయి, కానీ మా దగ్గిర మెకానికల్ ఉద్యోగాలకి రిక్వైర్మెంటు లేదు”.

సిలికాన్ వాలీ లో మీరే ఇంజనీరింగు చదివారన్నది ఇంపార్టెంటు కాదు, మీకెన్ని కంప్యూటర్ స్కిల్స్, ముఖ్యంగా ఇక్కడి అత్యధిక రిక్వైర్మెంటైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు ఎన్నొచ్చన్నది ఇంపార్టెంటు. ” అని తేల్చారు.

తల్లి నెత్తి కొట్టుకుంటూ అంది.

“నీకు వంద సార్లు చెప్పేను. మనం ఇంకా ఇక్కడ సిటిజన్సు కాదు. గ్రీన్ కార్డు హోల్డర్స్ మి కాదు. ఇంకా నాన్ ఇమ్మిగ్రంట్స్ మి. ఉద్యోగాలకు ఇక్కడ సాఫ్ట్ వేర్ ప్రొఫిషియెన్సీ తప్ప మరేదీ పనికిరాదని. విన్నావు కాదు. స్టూడెంటు వీసాలో ఉన్న వాడికి ఆదర్శాలు పనికి రావని అర్థం చేసుకో. ”

మరో త్రోవ లేని వినీత్ కి ఇష్టం లేని కెరీర్లో కష్టమైనా తల వంచాల్సిన పరిస్థితి లో పడేసిన వీసా నిబంధనల్ని తిట్టుకోవాలో, రిక్వైర్మెంటు అని మరే ఇంజనీరింగ్ కీ ఉద్యోగాలివ్వని కన్సల్టెన్సీలని తిట్టుకోవాలో అర్థం కాలేదు.

***

శైలజ కెమికల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసింది.

ఇక్కడే పుట్టి పెరిగి, సిటిజన్ అయిన శైలజ కి వీసా సమస్యలంటే ఏవిటో కూడా తెలీదు.

చదువు సక్రమంగా పూర్తి చేసి, ఉద్యోగాల వేట లో అడుగు పెట్టే ముందు తండ్రి దగ్గిర కూచోబెట్టుకుని చెప్పేడు. “మాలాగా నువ్వూ త్వరగా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నావా? జీవితాంతం ఎప్పుడు జీతం పెరుగుతుందా” అని ఎదురు చూడాలనుకుంటున్నావా? అని.

నిజానికి తనకి కెరీర్ ఎటు వెళ్తుందో తనకే తెలీదు, ఏదో స్నేహితులు చదువుతున్నారు కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ చదివిందంతే. జీతాలు తక్కువని చివరి వరకూ తనకు తెలీదు.

తండ్రి మాటలకు అర్థం మరో ఆరు నెల్లలో రెండు ప్రోగ్రామింగు లాంగ్వేజీలు నేర్చుకుని తన బాచ్ మేట్ల కంటే ఎక్కువ జీతానికి “సాఫ్ట్ వేర్” ఉద్యోగంలో చేరేక గానీ తెలియ లేదు శైలజ కి.

” రిక్వైర్మెంటు” ని బట్టి జీవితం మలచుకోవాలని సత్యం బోధ పడింది.

***

“ఇంత మంది ఆ ఆఫీసుల్లో ఏం చేస్తారంటావ్?” కొత్తగా అమెరికా వచ్చిన సతీశ్ పెద్ద పేరున్న సాఫ్ట్ వేర్ ఆఫీసు వైపు చూస్తూ అడిగాడు స్నేహితుణ్ణి.

“ఏముందిరా! ” రిక్వైర్మెంటు” పుణ్యమా అని రెండు చేతులా డబ్బు సంపాదిస్తూంటారు. అందుకోసం 24 గంటలు అందులో పడి ఎలుకల్లా కొట్టుకుంటూంటారు.”

అని “నాల్రోజులాగు, నువ్వూ…ఇంతే” అని నవ్వేడు స్నేహితుడు.

……..

http://www.andhraprabha.com/columns/a-column-by-kgeetha-madhavi/20863.html

First Published: 05 Aug 2014 in Andhra Prabha Daily

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s