అనగనగా అమెరికా-44 (పసిఫిక్ టైం- ఇండియన్ టైం)

అనగనగా అమెరికా-44

పసిఫిక్ టైం- ఇండియన్ టైం

“గుళ్లో పౌర్ణమి వ్రతం జరుగుతూంది మీరూ వస్తున్నారా, అడిగింది” మిత్రురాలు.

” పౌర్ణమి రేపు కాదండీ, ఎల్లుండి ” అన్నాను.

“అయ్యో, మీరు ఇక్కడి పసిఫిక్ టైం లో మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నది ఇండియన్ టైము లో” అంది.

“ఇండియా టైములో మనమిక్కడ పూజలు చెయ్యడమేమిటండీ” అన్నాను.

“అదంతేనండీ, ఒక వేళ ఇక్కడి పసిఫిక్ టైము ప్రకారం ఏ పూజ, పండగ చెయ్యాలనుకున్నా ఉదయానే ఎవరికి సమయం ఉందీ దేశం లో చెప్పండి, మన పండగలకి పబ్బాలకి ఇక్కడ స్కూళ్లకి, ఆఫీసులకి సెలవులు ఉండవు. పొద్దుటే 8 గంటల కల్లా పిల్లలు స్కూళ్లకి, మరో అరగంటలో అంతా ఆఫీసులకి పరుగెత్తాల్సిన తప్పని సరి జీవితాలు. అంత కంటే ఇలా ముందు రోజే చెయ్యడం వల్ల ఇండియా సమయంలో మనమూ ఇక్కడ పూజ చేసామన్న సంతృప్తీ ఉంటుంది ” అంది.

మాతోబాటూ వాకింగ్ లో కలిసి నడుస్తూన్న మా పక్క వీధావిడ “అందుకే మేం ప్రతీ పండగనీ శనివారం రోజే చేసుకుంటాం. కుటుంబమంతా కలిసి స్థిమితంగా వండుకున్నది తినడానికైనా సమయం లేనప్పుడు పండగలకు అర్థం ఏవుంటుంది? శనివారం ఎలాగూ అందరికీ సెలవు, పైగా వెజిటేరియన్ డే. వారం లో ఏ రోజు పండగొచ్చినా ఇలా శనివారం జరుపుకోవాలని అనుకోవడం వల్ల చక్కగా స్థిమితంగా నిద్రలేచి, తలారా స్నానాలు చేసి పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు.” అంది.

“నాకూ అలానే అనిపిస్తుంది. నిజానికి ఆఫీసుల్నించి వచ్చి దేవుడోమని సాయత్రంపూట వండడానిక్కూడా ఓపిక లేనప్పుడు ఈ పండగలేవిట్రా బాబూ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? అని నిట్టూర్చింది మిత్రురాలు.

“ఏం, మీ వారొప్పుకోరా?” అంది మాతో వచ్చినావిడ.

“కాదండీ, పండగొచ్చే ముందు రోజు నించీ ఇండియా నించి మా అత్తగారింటి నించి ఫోన్లు మొదలవుతాయి. మేం పసిఫిక్ సమయంలో పండగ చేస్తామన్నా ఒప్పుకోరు వాళ్లు. అక్కడ వాళ్ల పండగలూ పబ్బాలూ, చేసుకునే సమయానికే మేమిక్కడ పూర్తి చెయ్యాల్సిందే, పైగా పిల్లల్ని కుశల ప్రశ్నలడిగినట్లు”మీ అమ్మేం పిండి వంటలొండిందీ” అని ఆరాలు. మేమిక్కడున్నా కీలు బొమ్మల్లా అక్కడి నించి వాళ్లు ఆడిస్తూ ఉంటారు.” అంది నిష్టూరంగా.

“అదీ ఒకందుకు మంచిదేనేమో, అలా వెంటబడే వాళ్లూ లేకపోతే మొత్తానికి మనం మన సంస్కృతీ, సంప్రదాయాల్ని మర్చిపోమూ?” అంది కూడా నడుస్తూన్నావిడ.

“ఇవన్నీ సరేగానీ, మా అబ్బాయి తన పుట్టిన రోజుని ఈ ఏడాది ఇండియా టైములో మొదలెట్టి, యూఎస్ టైముకి ముగిస్తానని నిన్న పొద్దుట్నించే ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్ మొదలెట్టేడు” అంది మిత్రురాలు.

“న్యూజిలాండ్ టైములోనో, జపాను టైములోనో మొదలెడితే ఇంకా ఎక్కువ సమయం జరుపుకోవచ్చు” అన్నాను నవ్వుతూ.

ఇంటికి రాగానే అత్తయ్య నించి ఫోన్ వచ్చింది.

“అమ్మలూ, టిఫిన్లయ్యేయా!” అంది పాపతో.

“ఇప్పుడిక్కడ మాకు పగలు కాదు నానమ్మా, రాత్రి. ఇప్పుడు డిన్నర్, అంటే రాత్రి భోజనాల సమయం ” అంది చిన్నారి.

“ఏవిటో, అమెరికా..అమెరికా అని అంత దూరం వెళ్ళిపోయేరు. అంతేనా, అలవాట్లన్నీ మార్చేసుకున్నారు. వేళ కాని వేళ తినడం, నిద్రపోవడం. పెద్ద వాళ్ళు సరే. పిల్లలకైనా సమయం పాటించొద్దూ…..” అంటూ దండకం అందుకున్న అత్తయ్య కి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాని ‘ పసిఫిక్ టైం- ఇండియన్ టైం ‘ కాన్సెప్ట్ వివరించే పని తనది కాదు, నాదే అన్నట్టు సైగ చేసి, అక్కణ్ణించి పరుగెత్తారీయన.

……………..

Final Episode of Anaganaga America

Due to Sudden Closure of Andhra Prabha E-Paper This Column Had been stopped with this 44 th Episode.

 

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s