అతనితో నడిచే సాయంత్రం

అతనితో నడిచే సాయంత్రం
–కె.గీత
మేమిద్దరం ‘ఈవెనింగ్ వాక్’ కని
ఇంటి బయటికడుగు పెడ్తామా
చిన్న నాటి
తప్పిపోయిన స్నేహితుడు
హఠాత్తుగా
ఎదుట నిలుస్తాడు
ఎప్పటిదో
ఒక చిరపరిచిత హాసం
పున: ప్రత్యక్షమవుతుంది
ఎప్పుడూ
నా ఉనికి పట్టించుకోని
అతను
నాకు సహ ప్రయాణీకుడయ్యే
ఆ గంట
కాలచక్రం లోంచి
గభాలున తప్పుకుని
జలపాతమై
దుముకుతుంది
అతని మాటల్లో
అవేళ్టి స్టాకు మార్కెట్ లాభ నష్టాలో-
ఆఫీసు బాదర బందీ కబుర్లో-
చిత్రంగా
నా చెవులకి
వేళ్ళాడే అందాల జూకాలవుతాయి
నేను వినిపించే
పొద్దస్తమానపు పసికూనల
ముద్దు మాటలు
చెవినొగ్గి వినే
అతని మీసాల చాటున
వేల చంద్రహాసాలై
తళుక్కున మెరుస్తాయి
మేమలా
వీధి దాటి
మలుపు దాటి
బడి దాటి
బాల వనం దాటి
బాట వెంట
నడుస్తూంటామా
ప్రతి ఇంటి బయటా
విరబూసిన పూల మొక్కలు
వరుస సొగసుల పొదలు
దారి పొడుగునా
చిరు చీకట్లో మెరిసే
నక్షత్రాల కళ్లేసుకుని
వీధి చివరంటా
మా కోసమే
తొంగి చూస్తుంటాయి
అడుగడుగునా
సాయంత్రానికి విరజిమ్మే
నీటి బుగ్గలు
కృత్రిమ వాన జల్లులై
సాయంత్రపు ఏటవాలు వెల్తుర్లో
ఇంద్ర ధనస్సులై మెరిసి
గుండ్రని నీటి రెక్కల
తుమ్మెదలై
గిరికీలు కొడతాయి
ఇద్దరం చెప్పుకునే
కులాసా కబుర్లు
రోజల్లా యంత్రాల ముందు
వేడెక్కిన మస్తకాలకి
పని ఒత్తిళ్లలో
అలిసి సొలసిన శరీరాలకి
సేదతీర్చే చలివేంద్రాలవుతాయి
తప్పిపోయిన
మా లోపలి బాల్య స్నేహితులు
మాతో చెట్టాపట్టాలేసుకొని
నవ్వుతూ తుళ్ళుతూ
నడిచే
సాయంత్రపు వ్యాయామం
ప్రతి రోజూ
వ్యాహ్యాళిగా మారుతుంది
రెండు యంత్రాలైన మమ్మల్ని
ఇద్దరు మనుషులుగా మార్చే
సాయంత్రపు నడకలో
మూడు మైళ్లు
మూడు అడుగులవుతాయి
ఒక్కళ్లనొకళ్లం మర్చిపోయిన
మమ్మల్ని
రోజూ నిత్య నూతనంగా కలిపే
ఏడడుగులవుతాయి
————–

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s