పార్కులో పిల్లలు

 

చెట్ల నించి చెట్ల మీదికి తరుముకుంటూన్న
ఉడుత పిల్లలనుకుంటా వీళ్లు
పటపటా నేలను నలిగి చెదురుతున్న ఎండుటాకులు
చెరువు లో చేపపిల్లలు
ఈతకొలనులో ప్రత్యక్షమయ్యినట్లు ఎగిసి పడుతున్న తుంపరలు
ఇనుప ఊసల్ను వేళ్లాడుతూ
అడవి వానరాలను మరిపించే
వీళ్ల చిట్టి చేతులు
జారుడు బల్లలు జారుకుంటూ
ఆకాశం నించి జారిపడే
ఉల్కా పాతాల మెరుపుల కళ్లు
ఎటు నించి ఎటు చూసినా
కిలకిలా నవ్వుల
శబ్దాల సంబరాలు
ఇక్కడ జీవితం గురించిన తీవ్ర ఆలోచనలు లేవు
నిన్నటి బాధలూ
రేపటి బెంగలూ లేవు
చుట్టూ ప్రపంచపు ధ్యాస లేదు
అసలీ పిల్లలు ఇప్పుడే
ఒక కొత్త ప్రపంచం నించి
ఇప్పుడే ఇక్కడికి ప్రవేశించినట్లున్నారు
ఎన్నోసార్లు
ఈ పార్కుకి వచ్చినా
ఎన్నడూ ఎక్కడా చూడనట్లు
ఆనందోత్సాహాల పరుగుల కాళ్లూ, వీళ్లూ
భగవంతుడా!
ఈ పిల్లల్ని, ఈ పార్కుల్ని
సృష్టించిన నీకు జోహార్లు!
ఈ ప్రపంచంలో అందాల సీతకోకచిలుకల్ని
గాలివాటుకి రెపరెపలాడుతూ
ఆనందతాండవాన్ని పంచుతున్న తుమ్మెద కూనల్ని
పార్కులో ప్రత్యక్షం చేసి
బాధల బరువుల చీకటిలో దిక్కుతోచక
కూచున్నఈ దీనురాలికి
అసంకల్పితంగా చిరునవ్వుల
వెన్నెల దీపాల్నిబహూకరించిన
నీకు వేల జోహార్లు!!
…………….
-కె.గీత

http://www.californiatelugu.org/teluguvaani/poems.php

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s