సెలయేటి దివిటీ

నువ్విక్కడ లేవు
అయినా జ్ఞాపకాల
వెన్నెల దివిటీతో
దారి వెతుక్కుంటూ
ఇక్కడిక్కడే
తచ్చాడుతున్నాను
నీ క్షేత్రంలో మొలకెత్తిన
పంటల మధ్య తిరుగుతున్నాను
పళ్ల చెట్ల మధ్య
పరిగెడుతున్నాను
మోకాళ్ల వరకూ అంటిన
జ్ఞాపకాల మట్టి పరిమళం
సెలయేటి రొదై
గది గదినా
ప్రవహిస్తున్న నీ వాక్ప్రవాహాం
ఎటు మసిలినా
రెప రెపలాడుతూ
సీతాకోక చిలుకలు
నీ వంశ వృక్షాన వేళ్లాడుతూ-
గాలి లోంచి
మంత్రమేసినట్లు
మిణుగురు పిల్లలు
మిరుమిట్లు గొల్పుతూ-
నా చుట్టూ
ఉక్కిరి బిక్కిరిగా
పూల తీగెలై అల్లుకున్న నీ
దరహాసపు తెల్ల దనం
నా కోసమే
ఎదురు చూస్తూ
జీవన భారాన్ని
ఇన్నాళ్లూ మోసినట్లున్న
నీ ఫోటో కళ్ల గంభీరం
మనసు తలుపుల్ని
తెరవడం వరకే గానీ
మూయడమెరుగని
ప్రేమా పాశమేదో
రాత్రి చివర వేళ్లాడే
చందమామై
చుట్టూ ముసిరిన
మబ్బుల అవాంతరాల వెనక
దాక్కుంటూ
తొంగి చూస్తూ-
కనురెప్ప మూసినా
గతమయ్యి పోయే
వర్తమానం
కనురెప్పపాటులో
గోడల్లో ఇంకిపోయిన
గతాన్ని
కన్నారా వీక్షింపజేస్తూ
విహరింపజేస్తూ-
ఇక్కడ ఎక్కడ చూసినా నువ్వే-
నాలో దాక్కుని
నన్నే నిన్ను
చేసుకున్న నువ్వే-
——-
-కె.గీత

ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రచురణ -ఫిబ్రవరి 14, 2016

12742821_10201413801822948_7743140143817429075_n

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s