చినుకు నిశ్శబ్దం – కె . గీత


చినుకు నిశ్శబ్దం – కె . గీత
ఖండాంతరాళంలో అపరాహ్నం
నాలోకి నేను తొంగి చూసుకునే
ఒక అపరాహ్నం
నదుల్ని పొరలు చేసి
రహస్యంగా దాచుకున్న
రెప్పల ఇసుక మడతలన్నీ
ఎంత జాగ్రత్తగా
విప్పాననుకున్నా
సముద్రం భళ్లున
నెత్తిన దింబరించినట్టు
దు:ఖం
నేల లోకి వ్యథలు
వేళ్లై పోయిన
ఉప్పని ఊడలు వారిన
వేళ్లాడే దు:ఖం
ఎవరైనా ఉన్నారా!
నా బాధల గొంతుని తడిమి
ఒక మాట మంత్రం
వేసేవారెవరైనా మచ్చుకి
కనుచూపుమేర
ఖండాంతరాళంలో
ఒక్కరు ఉన్నారా?
ఎవరైనా కొంచెం
తీరికగా ఉన్నారా?
నా ముందు
ఒక్కో సారి
ఆకాశం అమాంతం అందినంత
తత్తర పాటు-
మరోసారి
నక్షత్రాలు నేల కూలిన
అశనిపాతపు వేటు-
ఇప్పుడు
నా కలల్ని
నమ్మేందుకు
ఎవరైనా-
ఉన్నారా?!
నా కళ్లని
ముద్దాడేందుకు
చినుకు రాలినంత
నిశ్శబ్దంగా
కను రెప్పల మీద
రెండు పెదాలు
ఆన్చేందుకు
ఒక్కరైనా
ఉన్నారా?!
నాలో నేను తొంగి
చూస్తున్నానన్న
ఈ వేళ
ఈ అపరాహ్నం
నదుల్ని పొరలు చేసి
రహస్యంగా దాచుకున్న
రెప్పల ఇసుక మడతల్లో
ఉప్పని ఊడలు వారిన
దు:ఖ సముద్రం-
ఈ అపరాహ్నం
ఈ ఖండాంతరాళంలో
కాస్త తీరికగా
నాతో నేనైనా
ఉన్నానా?!!!
…………

– కె . గీత
02/05/2017 విహంగ మహిళా పత్రిక

http://vihanga.com/?p=19587

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s