నదిని వేళ్లాడే సముద్రం(కవిత )-డా.కె.గీత

No automatic alt text available.

నదిని వేళ్లాడే విధి లేని సముద్రం లాగా
కష్టాల్ని పట్టుకుని వేళ్లాడే జీవితం
జీవితం స్థిమితంగా గడిచిపోతున్న
ఓ సాయం సమయాన
గుండె పోటు –
ఎవరూహించారు ? !
ఒక పిడుగు-
నిలివునా మింగేసిన
వెయ్యి తలల సర్పం –
కాలానికి ఉన్న అందమైన పేర్లన్నీ
చెరిగిపోయి
కన్నీళ్లు మిగిలిన
మనోవేదన
ఇంతేనా జీవితం ? !
ఎప్పుడూ ఇంతేనా ? !
విషాదాల కాటులతో
విలవిలలాడడమేనా ? !
ఆ క్షణాన
ప్రార్థించే పెదవులు తప్ప
ఏ స్పర్శా తెలియదు
ఆ క్షణాన
వేగంగా కొట్టుకునే
నాడి తప్ప ఏదీ వినిపించదు
భగవంతుడా !
భగవంతుడా !
నువ్వు ఉన్నావా?
ఉన్నావు కదూ !
నాలాంటి వాళ్ల కోసం
నువ్వింకా ఉన్నావు కదూ !
కరడు గట్టిన
కాలాన్ని కరిగించే
నాలుగు మాటలు
చెప్పే మనిషి లేడు
గుండె దు:ఖార్తిని
తీర్చే సమయం లేదెవ్వరికీ
వర్తమాన విషాన్ని
నాలుక చివర దాచేదెలా?!
ఉయ్యనూ లేను
మింగనూ లేను
కాలానికి నా పట్ల కాస్తయినా
దయ లేదు
గతపు కోరల గాయాల
మాననే లేదు
అంతలోనే
బాధల ముళ్ల
వర్తమానం తయారు
విడవనూ లేను
తొడగనూ లేను
స్థిమితంగా కొన్ని దినాలైనా
గడవనే లేదు
కళ్ల నించి జారే
దైన్యాన్ని
దిగమింగనూ లేను
వెలిబుచ్చనూ లేను
ఏం చెయ్యాలి భగవంతుడా!!!
నా కోసం ఉన్నావు కదూ!!
ఇక్కడ విహ్వలంగా పడి ఉన్న
నా మొర ఆలకించడానికి
ఎక్కడైనా
ఏదైనా రూపంలో ఉన్నావు కదూ!
——-

-కె.గీత

http://vihanga.com/?p=20446

06/03/2018

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s