నా గురించి

 

తూ.గో.జిల్లా  జగ్గంపేటలో జన్మించిన  డా|| కె.గీతా మాధవి “కె.గీత” పేరుతో కవయిత్రిగా రచనా ప్రపంచానికి గత పాతికేళ్లుగా చిరపరిచితురాలు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి  కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి.  భర్త శ్రీ సత్యన్నారాయణ, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలోని  సన్నీవేల్ లో నివాసముంటున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు,  తెలుగులో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006  లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.

అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం గూగుల్ లో తెలుగు భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.

ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) వీరి ప్రచురింపబడిన కవితా సంపుటాలు. కవిత్వంలో అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం ఆవార్డు, రంజనీ కుందుర్తి,  దేవులపల్లి మొ.న అవార్డు లు పొందారు. రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు.  సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై దేశం లోని ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అస్సామ్ వంటి అనేక ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. అనేక కవితలు, కథలు, వ్యాసాలు, పాటలతో బాటూ  ‘గీతా కాలం’ శీర్షికన ఆంధ్ర భూమి లో కాలమ్ , “అనగనగా అమెరికా” శీర్షికన ఆంధ్ర ప్రభ లో  కాలమ్,   వాకిలి పత్రికలో “సిలికాన్ లోయ సాక్షిగా” ధారావాహిక కథలు రాసారు. గత ఆరేళ్లుగా “నా కళ్లతో అమెరికా ” శీర్షికన విహంగ పత్రికలో నెల నెలా ట్రావెలాగ్స్, నాలుగేళ్లుగా కౌముదిలో “వెనుతిరగని వెన్నెల” ధారావాహిక నవల రాస్తున్నారు.

అమెరికాలో “బాటా” తెలుగు బడి “పాఠశాల” కి  కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు.

లలిత సంగీతం లో మంచి ప్రవేశం తో బాటూ అనేక బహుమతులు అందుకున్నారు.

2018 “బట్టర్ ఫ్లైస్”  సినిమా తో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు.

“వీక్షణం” సాహితీ సంస్థ, “తెలుగు రచయిత” రచయితల వెబ్సైటు, గాటా – GATA(Gobal Association of Telugu Authors) సంస్థాపక అధ్యక్షులు, నిర్వాహకులు.

*****

ప్రకటనలు

7 Responses to నా గురించి

 1. kalageeta అంటున్నారు:

  Hi Kiran garu, “Jivana Yanam lo” is in Vihanga only. No Blog or Published as a book yet. You could call her 9866467062.
  thanks- Geeta

 2. Kiran అంటున్నారు:

  Hello geetha,
  I’m following ur mother’s posts on vihanga. Pls let me know if she has a blog or her naa jeevana yanamlo hb published as a book? Pls convey my regards to her.

 3. kalageeta అంటున్నారు:

  ఈసారి అమెరికాకు వచ్చినప్పుడు తప్పక ముందే తెలియజేయండి. థాంక్స్-

 4. B V PRASAD అంటున్నారు:

  Thanks Geetha garu , mee website baavundi , meeru America lo vuntu Telugu Seva chesthunnaru , meeku dhanyavadamulu , naa menakodalu Sunnyvale lo , naa thammudu Dallas lo vuntaaru , ptathi year vasthuntaa , tks

 5. Sneha అంటున్నారు:

  Hi Geeta,
  Love your posts,all are great.

 6. Satya Sree అంటున్నారు:

  Madam happy to see your articles.. I read some.. like them very much. I need your email ID..

 7. udugula venu అంటున్నారు:

  me poetry fallow avuthuntaanu.ninna vasanthalakshmi madam me gurinchi spl ga cheppi blog address naaku ichaaru.monna oka workshop lo varthamaana kavitvam pina churcha jarigindi.andulo mee poem to paatu naa poem gurichi kuda code chesaru{2009 kavita}.
  mee text fresh ga undi akka.all da best.mee poems anni chadivaaka loncham anatical comment isthaanu.bye.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s