Author Archives: ratnakar1978

ఔర్ చాలీస్ బాకీహై-

ఇక ఆ తలుపులు ఎంత బాదినా తెరుచుకోవు-తలపులు మాత్రం ఇటువైపు రోదిస్తూఇక ఆ ఫోను మోగదు-పాతవేవో సంభాషణలు చెవుల మోగుతూఆ వేళ్ల నించి మెసేజీ రాదు-దు:ఖం ఇంకిపోయిన బాధాత్మకవేర్లుగుండెలోతుల్లో పాతుకుపోతూఔర్ చాలీస్ బాకీహై-ఔర్ చాలీస్ బాకీహై-ఇంకా వినిపిస్తూనే ఉంది..అరవయ్యేళ్ళకే తనువుపరిమితం కాదంటూఅనేవారుగాఔర్ చాలీస్ బాకీహై-నిజమనిపించేంతఆశాపాశం-తల్చుకున్నప్పుడల్లాఎంత బావుండేదీ-ఎప్పుడో ఒకప్పుడుఒక్కసారే చేరాలనుకున్నవృద్ధాశ్రమం-ఎప్పుడో ఒకప్పుడుభూగోళానికివతలకలిసి చెప్పుకోవాలనుకున్నకబుర్లు-తొందరేముందిఔర్ చాలీస్ బాకీహై-ఎప్పుడో ఒకప్పటికిమిగలని … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

గతపు పెట్టె

గతపు పెట్టెని తెరవనే కూడదుబిలబిలా ఎగిరే తూనీగల్తో బాటూతోకలు విరగదీసితలకిందులుగా వేళ్ళాడదీసినముళ్ళ తాళ్ళు కూడా ఉంటాయిమిలమిలా మెరిసే నక్షత్రాలతో బాటూఅగాధాంధకారంలోకివిసిరేసే ఖగోళాంతరాలు కూడా ఉంటాయిగలగలా పారే జలపాతాలతో బాటూకాళ్ళకి బరువై ముంచేసేబండరాళ్ళు కూడా ఉంటాయిసువాసనలు అలుముకున్న అడవుల్లోవేటాడే క్రూరమృగాలుపచ్చని పరిమళాల పూల పొదల్లోనేబలంగా చుట్టుకున్న నాగుబాములుప్రశాంత తామర కొలనుల్లోరహస్యంగా పొంచి ఉన్న మొసళ్ళు గతం పెట్టెని … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

వ్యక్తి-శక్తి

వ్యక్తిగా మొదలవ్వడం అంటే  నీకు నువ్వే అంకురమవ్వడం  నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం  నిన్ను నువ్వే ప్రేమించుకోవడం  ద్వేషించుకోవడం  నీలోనువ్వే మాట్లాడుకోవడం  పోట్లాడుకోవడం  నీకు నువ్వుగా మిగలడం  వ్యక్తిగా ఉన్నంతసేపు  నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం  నీ అరచేతికందినంతమేర- నీ బాధల్ని  నువ్వే తుడుచుకోవడం  నీ బంధాల్ని  నువ్వే పెంచుకోవడం  నువ్వే తుంచుకోవడం  … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

2019 ఉగాది  పండగ

ఉగాది పండగ నాడు ఉదయానే నిద్ర లేచానా పక్షుల కిలకిలా రావాలతో తెల్లారింది ట్వీట్ ట్వీట్ కీచ్ కీచ్……. అయ్యో అలెక్సా బర్డ్ సౌండ్స్ అంటే ట్వీట్ ట్వీట్ కీచ్ కీచ్……. కాదమ్మా… కమ్మని కోయిల కూత- నీ దగ్గిర లేదంటావా? “నా యూట్యూబ్ అకౌంట్ కి వెళ్లు” ఈ డివైస్ లో యూట్యూబ్ సెటప్ లేదంటావా? ఓహో! అది నువ్వు కాదు కదూ! సర్లే- ఇప్పుడు నిన్ను కాన్ ఫిగర్ చెయ్యలేను కానీ “ఓకే, గూగుల్! ప్లే కోయిల సౌండ్” అయో…రామ! కొయిలా బేర్ కాదమ్మా కోయిల… కోకిల…కోకిలమ్మ… మావి చిగుళ్లు మెత్తగా నెమరువేస్తూ అల చిటారు కొమ్మన కులాసాగా కూచుని ఉగాది వచ్చిందని నిద్ర లేపుతుందే మా పెరటి కోకిలమ్మ- ఆ…ఓకే గూగుల్! “కుకూ తియ్యని పాట” “కుకూ  పాటా” “కుకూ సౌండ్” ఏదోటి తగలెట్టు… హమ్మయ్య- యూట్యూబ్ పుణ్యమా అని “కుకూ” సౌండ్తో తెల్లారే భాగ్యం కలిగింది సమయానికి ఎవరో మహానుభావుడు అప్ లోడ్ చేసి పెట్టేడు హేయ్ సిరి! పిల్లలని ఒక్కొక్కళ్ళని కాల్ చెయ్యి- ఆ… … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

కొత్త జీవితం

కొత్త జీవితం కొత్త కలల్నించి పుడుతుంది కొత్త కలలు కొత్త ఆలోచనలనించి పుడతాయి ఆకాశం నించి తెరచాప వేళ్లాడినట్టు  అటక మీద జాబిల్లి దాక్కున్నట్టు  అల్లిబిల్లిగా హత్తుకున్నవేవేవో కలలు దూరాల్ని దారాలుగా మార్చేవేవేవో ఆలోచనలు ఉన్నదొక్కటే జీవితం పది జీవితాల పెట్టు పడే ప్రతీ సారీ వెయ్యేనుగుల బలంతో లేవనిచ్చే ప్రతీ కొత్త ఆలోచన వెనకా … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

వెనుచూడని విహంగం

పెనవేసుకున్న బంధం ఒక్కటి తంత్రి తెగిపడ్డట్టు రాలిపోయింది నిశ్శబ్దంగా  కాలంలో ప్రవహిస్తున్న నును వెచ్చని నీరు- నన్ను నేను ఓదార్చుకోలేక విహ్వలంగా  వేళ్ల చివర వేళ్లాడే ద్రవ హృదయం చాటున  కరడు కట్టి మూలిగే వేదన ఎలా తీరుతుంది? ఎన్ని రాత్రుళ్లు రోదించినా  వెనుచూడని విహంగంలా వెళ్ళిపోయిన ప్రాణం దాపున  జ్ఞాపకాలు వర్తమానమై  మిగిలిన  బహుమానం- … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

ఊపిరాడనివ్వడం లేదు

జార్జ్ ఫ్లాయిడ్!  నీ చివరి శ్వాస ఊపిరాడనివ్వడం లేదు మొన్నటిదాకా నువెవ్వరివో- ఇవేళ మాత్రం నువ్వు  అణిగణిగి  పెల్లుబికిన ప్రజాలావావి   పెళపెళమని విరుచుకుపడ్డ జనాకాశానివి   పీకె మీద కాలు నీ గొంతులో గుచ్చుకుంటున్న దృశ్యం   అనామకంగా ఇంకనివ్వకుండా      చరిత్రనేల విచ్చిన  మహోగ్ర మానవగర్జనవి    నినాదాలు మండేనాలుకలై ఎగిసిన   మానుష బడబానలానివి    నువ్విపుడు ఒక్కో కన్నీటి చుక్కా … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

బంగారమంటి

ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను  లంచ్ టైముకి కాస్త అన్నం  మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో రాత్రికి ఓ చిన్న చపాతీ ఏదో ఓ … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

అసింట

అయ్యగోరికీ దణ్ణంబెట్టు అమ్మగోరికీ దణ్ణవెట్టని డూ డూ బసవన్న బతుకేనెహె  అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే   అదురుస్టవనుకుని లగెత్తేవు గొబ్బిరి గాయలు దించనాకెహె అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే గుమ్మం తొక్కొచ్చకునేవు  దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె మటవేసుకుని మూలన  కుయ్ కయ్ అనకండా కూకుని పెసాదాన్ని మా సేతల్లోకి  ఇసిరే సేతి కోరికలు  మాత్తరవే … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

ఏడికి? – డా|| కె.గీత

1ఏడికి బోతున్నవే?బతుకుదెర్వుకి-ఈడనె ఉంటె ఏమైతది?బతుకు బుగ్గయితది- 2యాడికి బోతున్నావు?పొట్ట కూటికి-ఈడేడనో నెతుక్కోరాదూ?బతుకా ఇది- 3ఎందాక?అడగ్గూడదు-ఊళ్లోనే సూసుకుంటేనో?కూలి పనైనా లేందే- 1ఎందాక?ఏమో- 2యాడికి?ఊరికి- 3ఏడికి?బతకనీకి- (“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- జూన్, 2020 ప్రచురణ )

Posted in కవితలు | వ్యాఖ్యానించండి